Loan Apps: నేటి కాలంలో ప్రజలకు అప్పు తీసుకోవటం చాలా అలవాటుగా మారిపోయింది. దొరికినంత తీసుకుని తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఈ పర్యవసానాలు తీవ్ర స్థాయికి చేరుకుని మరణాలకు సైతం దారితీస్తున్నాయి.
ఇప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అంశం ప్రజలు ఆన్‌లైన్ లోన్ యాప్స్ నుంచి రుణాలను పొందటం గురించే. అవును లోన్ యాప్స్ నుంచి ఒక మహిళ రుణాన్ని పొందట ఖరీదైనదిగా మారింది. ముంబైలోని బ్యూటీషియన్ లోన్ యాప్ నుంచి రుణం తీసుకోగా.. తాజాగా యాప్ ఆపరేటర్లు ఆమెకు మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను పంపించిన సంగతి వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక బ్యూటీషియన్ ఎవర్‌లోన్ అనే యాప్ నుంచి రూ.10,000 అప్పుగా తీసుకున్నాడు. ఈ యాప్స్ ఆన్‌లైన్ రుణదాతలు అనుసరించే ప్రక్రియలో వ్యక్తులు వారి ఫోటో గుర్తింపు, పత్రాలు, ఇతర డిజిటల్/మొబైల్ యాక్సెస్‌కు యాక్సెస్ ఇవ్వడానికి అంగీకరిస్తారు. వీటికి లోన్ యాప్స్ ప్రతినిధులు దుర్వినియోగం చేస్తూ సదరు వ్యక్తులకు సంబంధించిన ఫొటోలను తస్కరించి వాటితో వారిని బెదిరించేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఏప్రిల్ 7న ఆ మహిళకు రుణం తిరిగి చెల్లించాలంటూ కాల్స్ రావడం మొదలయ్యాయి. కొన్ని సెకన్లలో డబ్బు చెల్లించాలని లోన్ ఏజెంట్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు ఆమెకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫొటోలను తన పరిచయాలకు, సన్నిహితులకు పంపుతానని బెదిరించారు. మహిళ హడావుడిగా డబ్బు చెల్లించినప్పుడు, ఆమె తన మొబైల్ ఫోన్‌లో నగ్నంగా ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫోటోలను గుర్తించింది. దీంతో ఆ మహిళ ఎల్టీ మార్గ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గత ఏడాది నవంబరులో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 72 శాతం మంది భారతీయులు ఇటీవలి కాలంలో వివిధ రకాల ఆన్‌లైన్ స్కామ్‌లు/మోసాల బాధితులుగా మారారని తేలింది. ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు 27 శాతం, నకిలీ జాబ్ ఆఫర్‌లు 26 శాతం, బ్యాంక్/కార్డ్ ఫిషింగ్ మోసాలు 21 శాతం, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు 18 శాతం, లాభదాయకమైన లాటరీ మోసాలు 18 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. వీటికి తోడు మోసగాళ్లు విరాళాలు, ప్రభుత్వ స్కీమ్స్, డేటింగ్ యాప్స్ అంటూ అనేక ఇతర రకాలైన మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. ప్రజలు వీటికి దూరంగా ఉండాలని ప్రభుత్వం, పోలీసులు సైతం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications