Petrol Prices: లీటరు పెట్రోల్ ధర 25 పైసలు మాత్రమే..! ఎప్పుడు..? ఎక్కడంటే..?
Petrol Prices: ఈరోజుల్లో బండి రేటు కన్నా దానిని నడపటానికి అవసరమైన పెట్రోల్ రేట్లను చూస్తేనే కళ్లు తిరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటేసి సామాన్యుడికి అందనంటోంది. అయితే అసలు లీటరు పెట్రోల్ రేటు కేవలం 25 పైసలంటే నమ్మబుద్ది కావటం లేదు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మన పెద్దోళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు పాత రోజులై మంచివి అని. అవి మళ్లీ తిరిగి రావని. అవును భారదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మన ఊహలకు సైతం అందనంత తక్కువగా ఉండేవి. 1947లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువ.. అప్పట్లో పెట్రోలు లీటరుకు 25 పైసలు ఉండేది. అప్పటితో పోల్చితే ప్రస్తుతం ఇంధన ధరలు వందల రెట్లు పెరిగిపోయాయి. దేశంతో పాటే ధరలు సైతం పరుగెడుతున్నాయి.

ఇక ఆ సమయంలో ఇతర వస్తువుల ధరలు సైతం చాలా తక్కువగా ఉండేవి. దీన్ని బట్టి ద్రవ్యోల్బణం ఎంత వేగంగా పెరిగిందో ఊహించుకోవచ్చు. మన అమ్మమ్మలు తాతయ్యలు కేవలం రూపాయికే నెయ్యి, పెరుగు, బియ్యం, పప్పులు, ఉప్పులు ఇలా చాలా వస్తువులు వచ్చేవని చెబుతుంటే ఈ తరం వారు ఆశ్చర్యపోతుంటారు. నమ్మసక్యంగా లేకున్నా అది నిజమే. ఆ సమయంలో అనేక వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉండేవి. నేటి కాలంలో రూపాయికి కనీసం అగ్గిపెట్టె కూడా దొరకని పరిస్థితి.
ఆ కాలంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాములకు కేవలం రూ.88.62గా ఉంది. ఈరోజు మార్కెట్లో అదే బంగారం విలువ అక్షరాలా రూ.60,000కు దగ్గరగా ఉంది. 1947లో రూపాయి డాలర్ మారకపు విలువ రూ.4గా ఉండేది. కాల క్రమంలో రూపాయి విలువ పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఒక్క డాలర్ కొనటానికి మనం 83 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వేలకు వేలు పెట్టి కొంటున్న సైకిల్ ధర ఆ రోజుల్లో కేవలం రూ.20 మాత్రమే. ఇలా చాలా వస్తువులు, ఆహారాలు తక్కువ రేటుకే ఎక్కువ నాణ్యతతో లభించేవి.


Click it and Unblock the Notifications