అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు నింగిని తాకుతున్న వేళ ఇతర లోహాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతుండగా.. తాజాగా రాగి (కాపర్) ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు ఇదే వరుసలోకి మరో కీలక లోహం లిథియం కూడా చేరింది. ఒకప్పుడు పరిశ్రమలకే పరిమితమైన ఈ లోహం, ఇప్పుడు భవిష్యత్ ఇంధన మార్పులో కీలక పాత్ర పోషిస్తూ పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, సంప్రదాయం, సెంటిమెంట్, భద్రతా ఆస్తి అన్న భావనలతో ముడిపడి ఉంది. అందుకే బంగారాన్ని పెట్టుబడిగా భావించే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే ప్రపంచం ఇప్పుడు మరో దిశగా కదులుతోంది. సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల యుగంలో lithium కూడా బంగారం లాంటి వ్యూహాత్మక లోహంగా మారుతోంది.

ప్రస్తుతం లిథియం డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో దీని వినియోగం అత్యంత కీలకంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఆధునిక పరికరాల్లో లిథియం తప్పనిసరి అయింది. అంతేకాకుండా రిన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రిడ్ బ్యాటరీ సిస్టమ్స్ వంటి రంగాల్లో కూడా దీని అవసరం విపరీతంగా పెరుగుతోంది.
సాధారణ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం-అయాన్ బ్యాటరీలు ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయి. దీంతో పాటుగా వేగంగా ఛార్జ్ అవుతాయి. ఎక్కువకాలం పనిచేస్తాయి. అందుకే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు ఈ బ్యాటరీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో.. రాబోయే సంవత్సరాల్లో లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రపంచ లిథియం నిల్వల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు లిథియం సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌తో పోలిస్తే, వీటిలో లిథియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి.ఇక భారతదేశంలో లిథియం నిల్వలు పరిమితంగానే ఉన్నప్పటికీ.. ఇటీవల గుర్తించిన ప్రాంతాలు పాజిటివ్ సంకేతాల్ని ఇస్తున్నాయి. జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో లిథియం వనరులు ఉన్నట్లు అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇవి వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి ఇంకా సమయం పడే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. భారత్ లిథియం అవసరాల కోసం ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. కానీ దేశీయంగా అన్వేషణ, తవ్వకాలు పెరిగితే భవిష్యత్‌లో ఈ లోహంపై ఆధారత కొంత తగ్గవచ్చు. ఒకప్పుడు బంగారం ఎలా భద్రతా ఆస్తిగా భావించబడిందో.. రాబోయే రోజుల్లో లిథియం కూడా అదే స్థాయిలో వ్యూహాత్మక లోహంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications