లీటరు పెట్రోల్ రూ.200, గుడ్డు రూ.10 మంటెక్కిపోతున్న రేట్లు.. ఇండియాలోనే..
Manipur crisis: పరిస్థితులు అదుపు తప్పిన మణిపూర్‌లో రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. నెల రోజుల కిందట రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస అనేక కష్టాలను తెచ్చిపెడుతోంది.
ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నిత్యావసరాల కొరత ధరలను ఆకాశానికి ఎత్తేసింది. దీనికి తోడు ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన మందుల కొరత అక్కడ ఏర్పడింది. అలాగే బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు సతమతమౌతున్నారు. జాతీయ రహదారిని పౌర సంస్థలు అడ్డుకోవడం, ట్రక్కులు ఇంఫాల్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలాంటి తరుణంలో పెట్రోల్ బంకుల్లో ఇంధనం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు బ్లాక్ మార్కెట్లో లీటరు పెట్రోల్ రూ.200 పెట్టి కొనుక్కుంటున్నారు. తెరచి ఉన్న బంకుల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక బియ్యం, ఉల్లి, బంగాళ దుంపలు వంటి నిత్యావసరాల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. అలాగే కోడి గుడ్డు ధర ఒక్కొక్కటి రూ.10కి చేరుకుంది. ప్రాణాలను రక్షించే మందులు, ఓవర్ ది కౌంటర్ ఔషధాల కొరత తీవ్రతరం కావటంతో అనేక మంది ముందుగా కొనుక్కుని నిల్వ చేసుకుంటున్నారు.
ప్రజల ఆశ్రయం కోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఆహారం, వైద్య సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కర్ఫ్యూ ఉండటంతో పరిస్థితులు మరింతగా జఠిలంగా మారాయి. ఇదే క్రమంలో హింసాత్మక చర్యలు కొనసాగటంతో బ్యాంకులు మూతపడగా.. ఏటీఎంలలో నగదు ఖాళీ అయ్యింది.
షెడ్యూల్డ్ తెగ(SC) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా గత నెలలో 'గిరిజన సంఘీభావ యాత్ర' తర్వాత.. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగటంతో అక్కడి పరిస్థితులు చేజారాయి.


Click it and Unblock the Notifications