ప్రపంచంలోని 25 సంపన్న కుటుంబాల లిస్టును బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసింది. ఈ ఏడాది వీరి సంపద రూ.34.5 లక్షల కోట్లు పెరిగింది. కన్స్యూమర్ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్ నడుపుతున్న వాల్టన్ కుటుంబం ఈ లిస్టులో టాప్లో ఉంది. అయితే గతేడాది రెండో స్థానంలో ఉండగా ఈ కుటుంబం మొత్తం సంపద విలువ రూ.36.7 లక్షల కోట్లు. గతేడాది కంటే రూ.14.6 లక్షల కోట్లు ఎక్కువ.
యుఎఇ, ఖతార్ రాజ కుటుంబాలు ఈ లిస్టులో రెండు ఇంకా మూడో స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్టులో 8.45 లక్షల కోట్ల మొత్తం సంపద విలువతో భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్, అత్యంత సంపన్నడు ముకేశ్ అంబానీ కుటుంబం 8వ స్థానంలో ఉంది. ఇండియాకి చెందిన మిస్త్రీ కుటుంబం రూ. 3.5 లక్షల కోట్లతో 23వ స్థానంలో నిలిచింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఈ కుటుంబానికి చెందిందే. ప్రపంచంలోని టాప్ 25 సంపన్న కుటుంబాల మొత్తం సంపద రూ.211 లక్షల కోట్లు. గత కొన్ని సంవత్సరాలుగా 70% కంటే ఎక్కువ కుటుంబాలు ఈ లిస్టులో టాప్-25 కుటుంబాలలో చేరాయి.

ప్రముఖ కుటుంబాల వ్యాపారం
వాల్టన్ కుటుంబం: 1950లో సామ్ వాల్టన్ అమెరికాలో ఫైవ్ అండ్ డైమ్ స్టోర్‌లను ప్రారంభించాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10,600 స్టోర్స్ ఉన్నాయి. వాల్‌మార్ట్‌లో 46% వాటా ఉంది.
ఫ్రాన్స్‌కు చెందిన హెర్మేస్ కుటుంబం: ప్రపంచంలో నాల్గవ అత్యంత సంపన్న కుటుంబం. వీరికి ఒక ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ ఉంది. 1837లో థియరీ హెర్మేస్ గుర్రపు బ్రీడల్స్(horse Bridle) తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు.
మార్స్ కుటుంబం: పోలియోతో బాధపడుతున్న ఫ్రాంక్ మార్స్ 1902లో క్యాండీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ బిజినెస్ మిల్కీ వె, స్నికర్స్ బార్‌కు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోని ఈ 7వ అత్యంత సంపన్న కుటుంబం దృష్టి పెంపుడు జంతువుల ఉత్పత్తులపై ఉంది.
అంబానీ కుటుంబం: ధీరూభాయ్ అంబానీ 1955లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ కంపెనీని స్థాపించారు. వెస్టర్న్ దేశాలకు సుగంధ మసాలాలు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు రిలయన్స్ కి టెలికాం, పెట్రోలియం, రిటైల్ సహా ఇతర వ్యాపారాలు ఉన్నాయి.
అంబానీ కుటుంబం సంపద భారతదేశ GDPలో 10%, భారతదేశ అత్యంత సంపన్న కుటుంబ వ్యాపారాలు 2024 సెప్టెంబర్‌లో విడుదల చేసారు. దీని ప్రకారం అంబానీ కుటుంబం మొత్తం విలువ రూ.25.75 ట్రిలియన్లు, అంటే భారతదేశ GDPలో 10%.
బార్‌క్లేస్-హురున్ ఇండియా నివేదిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ఇంధనం, రిటైల్ అండ్ టెలికాం రంగాలలో విస్తరించి ఉంది. బార్‌క్లేస్-హురున్ ఇండియా ఈ ర్యాంకింగ్ మార్చి 20, 2024 వరకు కంపెనీ వాల్యుయేషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ వాల్యుయేషన్‌లో ప్రైవేట్ పెట్టుబడి, లిక్విడ్ ఆస్తులు చేర్చలేదు. అంబానీ సంపద విలువలో రిలయన్స్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ ఇంకా ఇతర గ్రూప్ కంపెనీల వాటా ఉంది.
అయితే ధీరూభాయ్ అంబానీ రిలయన్స్‌కు పునాది వేయగా, అతను 28 డిసెంబర్ 1933న సౌరాష్ట్రలోని జునాగఢ్ జిల్లాలో జన్మించాడు. అతను వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు అతనికి పూర్వీకుల ఆస్తి లేదా బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి లేవు.
ధీరూభాయ్ 1955లో కోకిలాబెన్‌ను వివాహం చేసుకోగా అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్-అనిల్ అలాగే ఇద్దరు కుమార్తెలు దీప్తి అండ్ నీనా ఉన్నారు. జూలై 6, 2002న ధీరూభాయ్ మరణించిన తర్వాత అతని ఆస్తి పంపకంలో అతని భార్య కోకిలాబెన్ ప్రధాన పాత్ర పోషించింది. ముకేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆకాష్-ఇషా ఇంకా అనంత్. 2022లో ముఖేష్ తన పెద్ద కొడుకు ఆకాష్‌ని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కి చైర్మన్‌గా చేసాడు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని చూస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications