Best companies: భారతదేశంలో బెస్ట్ అండ్ వరస్ట్ కంపెనీలు ఇవే! నంబర్ 1 స్థానంలో ఏ కంపెనీ ఉందంటే..
ఉద్యోగం అనగానే కేవలం మంచి జీతం వస్తే సరిపోదు.. అక్కడ పని చేసే వాతావరణం, కెరీర్ గ్రోత్ , వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా ముఖ్యం. 2026 సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో పనిచేయడానికి అత్యంత అనువైన బెస్ట్ కంపెనీల (Best companies) జాబితాను 'బ్లైండ్' (Blind) అనే సంస్థ విడుదల చేసింది. ఉద్యోగుల నుంచి సేకరించిన గోప్యమైన సమాచారం , వారి సంతృప్తి స్థాయిని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు.

బ్లైండ్ అనేది ఒక ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ ఉద్యోగులు తమ కంపెనీల గురించి, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి , జీతాల గురించి అజ్ఞాతంగా (Anonymous) చర్చించుకోవచ్చు. ఒక వ్యక్తి తన కంపెనీ ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అయితేనే ఆ సంస్థలో పని చేస్తున్నట్లు వెరిఫై చేస్తారు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ ఇచ్చే రేటింగ్స్‌ను చాలా నమ్మదగినవిగా భావిస్తారు.
2026 లో టాప్ 15 కంపెనీలు
సుమారు 40,686 మంది భారతీయ ప్రొఫెషనల్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇందులో టెక్ దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. 2026 సంవత్సరానికి గాను భారతదేశంలోని ఉత్తమ కంపెనీల జాబితా (Best Companies List) ఓసారి చూస్తే..
భారతదేశంలో పనిచేయడానికి అత్యుత్తమ సంస్థలుగా నిలిచిన మొదటి 15 కంపెనీల్లో ఎన్విడియా (NVIDIA), గూగుల్ (Google), ఆపిల్ (Apple), అకామాయ్ టెక్నాలజీస్ (Akamai Technologies), వీఎమ్ వేర్ (VMware), అడోబ్ (Adobe), టార్గెట్ (Target), క్రెడ్ (CRED), నోకియా (Nokia), థాట్ వర్క్స్ (ThoughtWorks) ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్‌బిఎన్‌బి (Airbnb), లోస్ (Lowe's), ఆటోడెస్క్ (Autodesk), జోహో (Zoho) , సర్వీస్‌నౌ (ServiceNow) కూడా టాప్ 15 లో చోటు సంపాదించుకున్నాయి. ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌పై నమ్మకాన్ని, కంపెనీ సంస్కృతిని (Culture) ఎక్కువగా మెచ్చుకున్నారు.
తక్కువ రేటింగ్ పొందిన కంపెనీలు ఇవే..
కేవలం బెస్ట్ కంపెనీలనే కాదు, ఉద్యోగుల నుంచి తక్కువ మార్కులు పొందిన సంస్థల జాబితాను కూడా బ్లైండ్ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా ఇందులో కొన్ని పేరొందిన స్టార్టప్‌లు , పెద్ద ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో డిపి వరల్డ్ (DP World), ఓలా (Ola), స్ప్రింక్లర్ (Sprinklr), గ్రూపన్ (Groupon), టెకియాన్ కార్ప్ (Tekion Corp), పేటీఎం (Paytm), ఓయో (OYO), జీటా (Zeta), శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics), హెచ్‌సిఎల్ ఎంటర్‌ప్రైజ్ (HCL Enterprise), డెలివరూ (Deliveroo), కంపాస్ (Compass), రిప్లింగ్ (Rippling), ఇన్ఫోసిస్ (Infosys) , క్యాష్‌ఫ్రీ (Cashfree) ఉన్నాయి.
వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండటం లేదా కెరీర్ గ్రోత్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఈ కంపెనీలకు తక్కువ రేటింగ్ వచ్చి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ర్యాంకింగ్స్ ఎలా ఇచ్చారు?
ఈ బెస్ట్ కంపెనీల (Best companies) జాబితాను ఎంపిక చేసేటప్పుడు కనీసం 50 మంది ఉద్యోగుల సమీక్షలు ఉన్న కంపెనీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఐదు అంశాల ఆధారంగా రేటింగ్ ఇచ్చారు..
- ఓవరాల్ సాటిస్‌ఫాక్షన్ (మొత్తం సంతృప్తి)
- కెరీర్ గ్రోత్ (ఉద్యోగంలో ఎదుగుదల)
- వర్క్-లైఫ్ బ్యాలెన్స్
- జీతాలు , ఇతర ప్రయోజనాలు
- కంపెనీ మేనేజ్‌మెంట్‌పై ఉన్న నమ్మకం
ముఖ్యంగా NVIDIA, Google , Apple కంపెనీలు తమ ఉద్యోగులకు అత్యుత్తమ సదుపాయాలు , స్వేచ్ఛాయుతమైన పని వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది. మీరు కూడా కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే.. ఈ జాబితా మీకు ఒక మంచి మార్గదర్శిగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications