మద్యం టెండర్లతో తెలంగాణ సర్కార్ కు భారీగా ఆదాయం వస్తోంది. మద్యం టెండర్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆగస్ట్ 11 నాటికి సుమారు 7 వేలకు పైదరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. తెలంగాణలో 2620 వైన్ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షాపులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మద్యం టెండర్లకు అప్లికేషన్ పెట్టాలంటే రూ.2 లక్షలు కట్టాలి. అయితే ఇది రిఫండబుల్ కాదు.
షాపులు రాకుంటే కట్టిన రూ.2 లక్షలు సర్కార్ ఖాతాల్లోకే వెళ్తాయి. దీంతో సర్కార్ కు భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ దరఖాస్తుల ద్వారా రూ.1000 కోట్లు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా దాదాపు 2 వేల కోట్లు రాబట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో నిన్నటి వరకు మొత్తం 15,404 దరఖాస్తులు రాగా.. నిన్న ఒకేరోజు 8,491 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపు టెండర్ లో పాల్గొనడానికి ఈ నెల 18వ తేదీ గడువు ముగుస్తుంది. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నారు.

గౌడ్స్ కు 15 శాతం రిజర్వేషన్ కేటాయించగా.. ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఈ లెక్కన గౌడ్స్ కు 363 మద్యం షాపులు రాగా.. ఎస్సీలకు 262 షాపులు వచ్చాయి. ఎస్టీలకు కూడా కొన్ని షాపులు కేటాయించారు. కాగా.. ఆగస్ట్ 20, 21 తేదీల్లో డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయిస్తారు. షాపులు వచ్చిన వారు రెండేళ్ల పాటు నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న షాపులు నవంబర్ వరకు నిర్వహిస్తారు. ఇప్పుడు కొత్తగా షాపులు వచ్చిన వారు డిసెంబర్ నుంచి వారి షాపులను ప్రారంభించుకోవచ్చు. మద్యం టెండర్లకు ఇంత భారీగా దరఖాస్తులు రావడానికి మద్యానికి ఉన్న డిమాండ్.
తెలంగాణలో సగటున 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఎక్కువగా మద్యం అమ్మాలని ఎక్సైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications