చండీగఢ్: పంజాబ్‌లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ తన సరికొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆరంభం నుంచి అంటే.. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

రూ.9,600 కోట్ల ఆదాయం లక్ష్యం..
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన ఈ నూతన మద్యం పాలసీ వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలోనే కనీసం 9,647.85 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ పాలసీ ప్రభావంతో ఇప్పుడున్న మద్యం ధరల్లో కనీసం 35 నుంచి 60 శాతం వరకు మద్యం ధరలు తగ్గనున్నాయి. దీనివల్ల మద్యం అమ్మకాలు రెట్టింపు అవుతాయని, అక్రమ మద్యం తరలింపు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

హర్యానాతో పోల్చుకుంటే..
పొరుగునే ఉన్న హర్యానాలో మద్యం ధరలు కాస్త ఎక్కువే పంజాబ్‌లో. ఫలితంగా అక్రమ మద్యం తరలింపు యథేచ్ఛగా సాగుతోందని పంజాబ్ ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని నివారించడానికి పలు చర్యలు తీసుకున్నప్పటికీ.. ఉపయోగం ఉండట్లేదు. ఫలితంగా మద్యం ధరలను తగ్గించడం వల్ల అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తోంది.

ఐఎంఎఫ్ఎల్, బీర్లు..
దేశీయ మద్యంతో పాటు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, బీర్ ధరలను తగ్గించింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. హర్యానాలో అమ్ముడవుతోన్న మద్యం ధరలతో పోల్చుకుంటే.. 10 శాతం మేర తక్కువకే లిక్కర్ లభిస్తుంది పంజాబ్‌లో.

60 శాతం వరకు రేట్లు తగ్గుముఖం..
ఒక్కో బీర్ ధర పంజాబ్‌లో 120 నుంచి 130 రూపాయల్లోపు లభిస్తే.. హర్యానాలో దీని ధర 140 నుంచి 150 రూపాయల వరకు ఉంటోంది. ప్రస్తుతం పంజాబ్‌లో బీర్ ధర 180 నుంచి 200 రూపాయలు పలుకుతోంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ధరలో కూడా భారీ తేడా రానుంది. ప్రస్తుతం ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ పంజాబ్‌లో 700 రూపాయలు ఉంటే హర్యానాలో 510 రూపాయలే.

భారీ తేడా..
ఇప్పుడు తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం.. పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు పడిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కనీసం 9,647.85 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రేట్ల వల్ల అమ్మకాలు ఊపందుకుంటాయని వ్యాఖ్యానించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications