Piccadily Agro Stock: మార్కెట్ల ఒడిదొడుకులతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీల షేర్లు తమ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తూ వారిని ధనవంతులుగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక లిక్కర్ స్టాక్ ఇన్వెస్టర్లను లాభాల మత్తులో ముంచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టాక్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న పికాడిల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. హర్యాణాకు చెందిన మద్యం తయారీ కంపెనీ షేర్లు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ స్టాక్ వరుసగా 8 ట్రేడింగ్ సెషన్లలో 5% ఎగువ సర్క్యూట్‌ను తాకింది. ఈరోజు సైతం కంపెనీ షేర్లలో పెరుగుదల కారణంగా స్టాక్ ధర రూ.549కి చేరుకుంది. ఇది కంపెనీ 52 వారాల గరిష్ఠ స్థాయి కావటం విశేషం. ఇదే క్రమంలో కంపెనీ 52 వారాల కనిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.45.20గా ఉంది.

పికాడిల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్ షేర్లలో కొనసాగుతున్న వరుస ర్యాలీతో ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు. ఏప్రిల్ 10న పెట్టుబడి పెట్టిన రూ.లక్ష విలువ ఇప్పుడు దాదాపు రూ.1.50 లక్షలుగా మారిపోయింది. ఎవరైనా ఇన్వెస్టర్ నెల కిందట కంపెనీ షేర్లలో లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని మార్కెట్ విలువ రూ.1.82 లక్షలకు చేరుకుని ఉండేది. వాస్తవానికి కంపెనీ షేర్లలో పెరుగుదలకు కారణంగా త్రైమాసిక లాభాలు నాలుగు రెట్లు పెరగటమే. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 818.22% పెరిగి రూ.43.34 కోట్లకు చేరుకోగా.. అమ్మకాలు 36.84% పెరిగి రూ.266.53 కోట్లకు చేరుకున్నాయి.
కంపెనీ మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 391.54% పెరిగి రూ.109.76 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో అమ్మకాలు 29.16% పెరిగి రూ.774.55 కోట్లకు చేరాయి. ఇదే క్రమంలో కంపెనీ రూ.1,000 కోట్లను సమీకరించేందుకు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
పికాడిల్లీ ఆగ్రో కంపెనీ 1994లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో చక్కెర, బెల్లం, బగాస్, ఇథనాల్‌లను తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ చక్కెర, డిస్టిలరీ విభాగాల ద్వారా పనిచేస్తుంది. ఇది మాల్టా, మార్షల్స్, విస్లర్, కామెట్, ఇంద్రి ట్రిని, కమికారా రమ్, రాయల్ హైలాండ్, గోల్డెన్ వింగ్స్ బ్రాండ్ పేర్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications