TCS News: దేశంలో IT సేవల రంగం వేగంగా విస్తరిస్తోంది. పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే వీటిలో పనిచేయడానికి ఉత్తమమైన కంపెనీలపై తాజాగా ఓ నివేదిక వెలువడింది. పలు దిగ్గజ కంపెనీలు ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి.
2024 సంవత్సరానికిగాను భారతదేశంలో పనిచేసే అగ్రశ్రేణి కంపెనీలకు లింక్డ్ ఇన్ తాజాగా ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో టాప్ 25 పెద్ద కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఇవే కాకుండా మరో టాప్ 15 మధ్యతరహా సంస్థలతో కూడిన కొత్త కేటగిరీని కూడా ఈ ఏడాది పరిచయం చేసింది. కెరీర్ వృద్ధికి కీలకమైన 8 కీలక అంశాల ద్వారా ఈ ర్యాంకింగ్‌లు నిర్ణయించబడినట్లు తెలుస్తోంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పెద్ద కంపెనీలలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యాక్సెంచర్ మరియు కాగ్నిజెంట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌కు సంబంధించిన పలు కంపెనీలు లింక్డ్ ఇన్ లిస్టులో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మాక్వేరీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ మరియు JP మోర్గాన్ చేజ్ & కో కంపెనీలు సహా 9 సంస్థలు ఇందులో ఉన్నాయి. సాంకేతిక మరియు ఔషధ రంగాలకు చెందిన కంపెనీలు కూడా టాప్ 25లో చేర్చబడ్డాయి.
ఇక మధ్యతరహా కంపెనీల విభాగంలో SaaS ప్లాట్‌ఫారమ్ లెంట్రా అగ్రస్థానాన్ని సాధించింది. మేక్‌మైట్రిప్, ప్రదాన్, నైకా మరియు డ్రీమ్11లు తరువాతి వరుసలో ఉన్నాయి. వివిధ రంగాలలో అత్యంత కావలసిన నైపుణ్యాలను లింక్డ్ఇన్ నివేదిక హైలైట్ చేసింది. ఆర్థిక రంగంలో పెట్టుబడిదారుల సంబంధాలు, మూలధన మార్కెట్లు మరియు పెట్టుబడి బ్యాంకింగ్ వంటి నైపుణ్యాలు డిమాండ్‌లో ఉన్నాయి. IT రంగంలో ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, డేటా స్టోరేజ్ టెక్నాలజీలు మరియు కృత్రిమ మేధస్సులో నైపుణ్యాన్ని కంపెనీలు కోరుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications