9-5 working: సాధారణంగా భారత్‌లో ఉద్యోగం అంటే ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం 5 అయ్యేసరికి బయటికి రావడం. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో పనివేళల్లో మార్పులు వచ్చాయి. కానీ ఇప్పటికీ మెజారిటీ సంస్థలు సాధారణ సమయాన్నే పాటిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఇది పూర్తిగా మారనుందనే అంచనాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ప్రముఖ ఎంప్లాయ్‌మెంట్ ఫోకస్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ సహ-వ్యవస్థాపకులు రీడ్ హాఫ్‌మన్.. 9-5 ఉద్యోగాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో సంప్రదాయ పనివేళలు కాలగర్భంలో కలిసిపోతాయని పేర్కొన్న పాత ఇంటర్యూ మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆయన ఊహించిన అంశాలను పరిగణలోనికి తీసుకుని ఉపాధి పరిణామ క్రమం మరియు గిగ్ ఎకానమీ యుగంలో అనిశ్చితిని తగ్గించేందుకు కంపెనీలు చర్యలు తీసుకోవాలనే భావన వ్యక్తమవుతోంది.

నీల్ తపారియా అనే భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులు.. హాఫ్‌మన్ ఇంటర్వ్యూ నుంచి ఓ క్లిప్‌ను కట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 'మీ 9-5 ఉద్యోగం త్వరలో కనిపించదు. 2034 నాటికి అంతరించిపోతుంది. ఇది రీడ్ హాఫ్‌మన్ తాజా అంచనా. 1997లో సోషల్ మీడియా ఎదుగుదలను అంచనా వేసిన లింక్డ్‌ఇన్ స్థాపకులు ఈ విధంగా పేర్కొన్నారు' అని అందులో వెల్లడించారు.
సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ప్రపంచాన్ని మారుస్తాయని రీడ్ హాఫ్‌మన్ గతంలో అంచనా వేశారు. వెకేషన్ రెంటల్ దిగ్గజం Airbnbలో ప్రారంభ పెట్టుబడిదారులు కాగా షేరింగ్ ఎకానమీ పెరుగుదలను ముందే ఊహించారు. చాట్‌జీపీటీ ప్రారంభానికి ఏళ్లకు ముందే కృత్రిమ మేధస్సు (AI) విప్లవాన్ని కూడా గ్రహించారు. ఆయన గత మూడు అంచనాలు నిజమయ్యాయని తపారియా తెలిపారు. ఈసారి అంచనా కూడా తప్పదని భావిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications