Balapur Laddu: రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ..!
తెలంగాణలో బాలాపూర్ వినాయకుడి లడ్డూకు చాలా పేరుంది. ఈ లడ్డూ సంవత్సరం సంవత్సరం భారీ ధర పలుకుతూ రికార్డు సృష్టిస్తోంది. తాజాగా బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.39 లక్షలకు సామా ప్రణీత్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ వేలంలో పాల్గొనేందుకు 9 మంది తమ పేర్లను నమోదు చేసున్నారు. నవరాత్రులు పూజలందుకున్న స్వామివారి చేతిలోని 21 కిలోల లడ్డూను ఈ సంవత్సరం రూ.39 లక్షలకు సాహెబ్‌నగర్‌కు చెందిన సామా ప్రణీత్‌రెడ్డి తీసుకున్నారు. గతేడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ ధర రూ.35 లక్షలు పలికింది. ఈ సారి రూ.4 లక్షలు ఎక్కువ వేలం లడ్డూను వేలంలో సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు.
అర్బన్ గ్రూప్‌కు చెందిన ప్రణీత్ రెడ్డి లడ్డూను వేలం పాటలో సొంత చేసుకున్నారు. ఆయనతో పాటు వేలం పాటలో మర్రి రవికిరణ్ రెడ్డి(చంపాపేట్), కేవీఏ ఫ్లవర్ మర్చంట్- కందాడ శాలిని వీరేందర్ రెడ్డి (చంపాపేట్), కంచర్ల శివ రెడ్డి(హస్తినాపురం), ది సుషీ కో సామ దయానంద్ రెడ్డి & సామ వరణంద్ రెడ్డి(లండన్), జీఎన్ఆర్ డెవలపర్స్ - గడ్డం నవీన్ రెడ్డి(హస్తినాపురం), పీఎస్‌కే గ్రూప్ (శ్రీకాంత్), ఇబ్రాం ప్రత్యూష్ (బాలాపూర్) పాల్గొన్నారు. 21 కిలోల బాలాపూర్ గణేశుడి లడ్డూ కోసం 9 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో ఐదు కంపెనీలు ఉన్నాయి. కేవలం లడ్డూ కోసమే ఎన్‌ఆర్‌ఐలు బాలాపూర్‌కు వచ్చారు. 1994లో రూ.450తో మొదలైన వేలం 2026లో రూ.39 లక్షలకు చేరింది.

ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటపైనే ఉంటుంది. 32 ఏళ్లుగా ఇక్కడ లడ్డూ వేలం పాట కొనసాగుతుందని నిర్వాహుకులు చెప్పారు. 1994లో రూ.450తో మొదలైన లడ్డూ వేలం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి లక్షలకు చేరింది. 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాటలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడతారు. 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలుకగా.. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీ పడి రూ.లక్షా 5వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2007లో స్థానికుడు రఘునందన చారి 4లక్షల 15వేలకు లడ్డూ సొంతం చేసుకున్నారు.
2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటింది. కల్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10లక్షల 32వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2016లో ఇది రూ.4 లక్షలు పెరిగింది. అప్పుడు స్కైలాబ్ రెడ్డి రూ.14లక్షల 65వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15లక్షల 60వేలకు, 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16లక్షల 60వేలకు, 2019లో కొలను రాంరెడ్డి రూ.17లక్షల 60వేలకు, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు చేశారు. ఆ లడ్డూను అప్పటి సీఎం కేసీఆర్ కు ఇచ్చారు. 2021లో ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి రూ.18లక్షల 90వేలకు, 2022లో రూ.24లక్షల 60వేలకు వంకేటి లక్ష్మా రెడ్డి సొంత చేసుకున్నారు.
2023 రూ.27 లక్షలకు దయానందరెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోగా.. 2024లో రూ.30 లక్షల ఒక వెయ్యికి కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. 2025లో కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ పోటా పోటీగా రూ.5 లక్షలు చెల్లించి రూ.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
