Tata Motors: టాటా గ్రూప్ అంటే దేశ ప్రజలకు ఎంతో నమ్మకం. అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ గా భావిస్తారు. ఇక ఆ కంపెనీ తయారు చేసిన వాహనాలు క్వాలిటీ గురించి చెప్పడం కంటే ఏవైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు చూస్తే తెలుస్తుంది. ఆ స్థాయిలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వినియోగదారులకు సేవలందిస్తుంది. ఫైనాన్స్ రంగంలోనూ చక్రం తిప్పుతున్న టాటా గ్రూప్ తాజాగా ఓ ప్రకటన చేసింది.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) అరేంజ్మెంట్ స్కీమ్ కింద టాటా మోటార్స్, టాటా క్యాపిటల్, టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి ఆయా బోర్డులు ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది సమయం పడుతుందంటూ టాటా మోటార్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి షేర్ స్వాప్ ద్వారా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేసింది. అంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ షేర్లు టాటా క్యాపిటల్ తో విలీనం కానున్నాయి.

టాటా మోటార్స్ ఫైనాన్స్ వాటాదారులు ప్రతి 100 షేర్లకు 37 టాటా క్యాపిటల్ షేర్లు పొందేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. విలీనం తర్వాత సదరు కంపెనీలో టాటా మోటార్స్ 4.7 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఈ విలీనం వల్ల టాటా మోటార్స్ ఫైనాన్స్ కస్టమర్లకు ఎటువంటి నష్టం లేదా వారిపై ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం కంపెనీ చేసింది.
టాటా క్యాపిటల్ గృహ, వాహన, విద్యా రుణాల విభాగంలో కీలక ప్లేయర్‌గా కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 150 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా ఇదే సమయంలో టాటా మోటార్స్ ఫైనాన్స్ ఫైనాన్స్ కేవలం 52 కోట్ల లాభాన్ని ఆర్జించగలిగింది. ఈ విలీనం వల్ల టాటా మోటార్స్ కూడా ప్రభావితం కానుంది. కాగా ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకు నియంత్రణ సంస్థ ఆమోదం కోసం సదరు కంపెనీలు ప్రస్తుతం ఎదురుచూస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications