Multibagger Stock: ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన మల్టీబ్యాగర్.. మీ దగ్గర ఉందా..??
Multibagger Stock: మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని వారిని ఏకంగా కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది లిండే ఇండియా కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ పారిశ్రామిక రంగానికి గ్యాస్ సరఫరా చేస్తుంటుంది. గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 944 శాతం రాబడిని అందించి పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చింది. 1999లో కంపెనీ షేర్ ధర కేవలం రూ.39గా ఉంది. కానీ ఈరోజు మార్కెట్లో స్టాక్ ధర 4 శాతానికి పైగా లాభపడి ఎన్ఎస్ఈలో రూ.4,784 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

అప్పట్లో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ దాదాపు రూ.1.20 కోట్లకు చేరుకుని ఉండేది. ఇన్వెస్టర్లను మిలియనీర్లుగా మార్చేసిన కంపెనీ షేర్ గత ఏడాది కాలంలో 24 శాతం ర్యాలీ చేసింది. అలాగే 2023లో ఇప్పటి వరకు 35 శాతం మేర లాభడిని అందించింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.4,863 దగ్గర ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.2,933 వద్ద ఉంది. గత త్రైమాసికంలో కంపెనీ రూ.99.25 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
లిండే ఇండియా కంపెనీలో 75% వాటాలు ప్రమోటర్లు కలిగి ఉండగా 25% పబ్లిక్ హోల్డింగ్ ఉంది. జూన్ 30, 2023 నాటికి లిండే ఇండియాలో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ 0.44%గా ఉంది. అలాగే ఇదే సమయంలో కంపెనీలో FII హోల్డింగ్ 2.65%గా ఉంది. గత త్రైమాసికం నుంచి ఎఫ్‌ఐఐలు కంపెనీలో తమ వాటాలను క్రమంగా పెంచుకుంటున్నారు. మార్కెట్ నిపుణులు సైతం కంపెనీ షేర్లపై ఇంకా బులిష్ గానే ఉన్నారు. ఈరోజు స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.4,863 మార్కును ఇంట్రాడేలో తాకింది.
లిండే ఇండియా లిమిటెడ్ ఇండస్ట్రియల్ గ్యాస్, అనుబంధ ఉత్పత్తుల విభాగంలో ప్రధానంగా ప్రాధమిక ఉక్కు, గ్లాస్, రసాయన పరిశ్రమలకు పైప్‌లైన్ గ్యాస్ సరఫరా, క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా ద్రవీకృత వాయువుల సరఫరా వ్యాపారంలో ఉంది. ఫ్యాక్టరీ, నిర్మాణ పరిశ్రమ, PED గృహ వినియోగం కోసం అలాగే థర్డ్ పార్టీ వినియోగదారులకు విక్రయించడానికి క్రయోజెనిక్ నౌకలను కూడా తయారు చేస్తోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications