LiFi: మొబైల్ వినియోగం విపరీతంగా పెరగడంతో ఇంటర్నెట్ లేనిదే రోజు గడవడం లేదు. స్పీడ్ విషయంలో వైర్డ్ నెట్‌వర్క్స్ తో పోలిస్తే వైర్ లెస్ కొంత వెనుకబడిందని చెప్పవచ్చు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్పీడ్ పెంచడానికి, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను విస్తరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అతిత్వరలో అందుబాటులోకి రానున్న LiFi టెక్నాలజీని గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న వైఫై స్పీడ్ చూసి మనం థ్రిల్ అవుతున్నాం. ఒకవేళ దానికి 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోగలిగితే..? ఇది త్వరలోనే సాకారం కానుంది. 802.11 WiFi స్పీడును ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (IEEE) అప్ డేట్ చేస్తోంది. లైట్ ఫిడిలిటీ(LiFi)గా పిలుచుకునే 802.11bb అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది.

WiFiలో సాధారణంగా వినియోగించే రేడియో ఫ్రీక్వెన్సీ బదులు LiFiలో కాంతి ద్వారా డేటాను ప్రసారం చేస్తారు. తద్వారా దాదాపు కాంతి వేగంతో ఇంటర్నెట్ అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ సాంకేతికత ద్వారా 224 GB/Sec స్పీడ్ సాధించవచ్చని చెబుతున్నారు. దీనికోసం మోడెమ్స్, రూటర్స్, రిసీవర్స్ వంటి ఇతర పరికరాల అవసరం సైతం ఉండదు.
ఇంట్లో, వీధి లైట్లలో ఉపయోగించే LED బల్బులకు LiFi టెక్నాలజీని కనెక్ట్ చేయవచ్చు. తద్వారా అదనపు విద్యుత్ వినియోగం ఖర్చు కూడా ఉండదు. ఈ సాంకేతికతను ఉపయోగించి దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించవచ్చు. అతి త్వరలోనే ఈ టెక్నాలజీ ఇంటెర్నెట్ ను ఏలుతుందని అంచనా.


Click it and Unblock the Notifications