For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC: సెన్సెషనల్ నిర్ణయం తీసుకున్న ఎల్ఐసీ.. ఆ కంపెనీలో వాటాల విక్రయం.. విలువ ఎంతంటే..

|

LIC: దేశంలో అనేక మంది తమ పెట్టుబడుల లక్ష్యాలు, భద్రత కోసం ఎల్ఐసీ పాలసీల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఈ డబ్బును లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పెట్టుబడులుగా పెడుతుంటుంది. ఇలా చేయటం వల్ల కంపెనీలకు పెట్టుబడులను అందించటమే కాక, పాలసీదారులకు లాభాలను అందిస్తుంది.

ఫార్మా పెట్టుబడుల ఉపసంహరణ..

ఫార్మా పెట్టుబడుల ఉపసంహరణ..

LIC సన్ ఫార్మా కంపెనీలో తన పెట్టుబడులను ఉపసంహరించుకుంది. ఏడాది కాలంలో రూ.3,821 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు వెల్లడించింది. సన్ ఫార్మాస్యూటికల్స్‌లో తనకున్న 2 శాతం వాటాను తగ్గించుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సోమవారం తెలిపింది.

సెబీకి వివరాలు..

సెబీకి వివరాలు..

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. ఎల్ఐసీ మే 17, 2021 నుంచి జూలై 22, 2022 మధ్య కాలంలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా వాటాలను విక్రయించనట్లు పేర్కొంది. షేర్లను యావరేజ్ గా ఒక్కొక్కటి రూ.808.02 రేటుకు విక్రయించబడ్డాయి.

ప్రస్తుతం వాటాల వివరాలు..

ప్రస్తుతం వాటాల వివరాలు..

"సన్ ఫార్మాస్యూటికల్స్‌లో కార్పొరేషన్ కంపెనీలో వాటాలు 16,85,66,486 నుంచి 12,05,24,944 ఈక్విటీ షేర్లకు తగ్గాయి. అంటే సుమారు 4 కోట్ల షేర్లను ఎల్ఐసీ అమ్మేసింది. ఈ వివరాలు వెల్లడి కావటంతో సోమవారం స్టాక్ మార్కెట్లో సన్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు 0.75 శాతం క్షీణించి రూ. 868.05 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో ఎల్ఐసీ షేర్ ధర 0.70 శాతం క్షీణించి రూ. 684.15 వద్ద ముగిసింది.

English summary

LIC: సెన్సెషనల్ నిర్ణయం తీసుకున్న ఎల్ఐసీ.. ఆ కంపెనీలో వాటాల విక్రయం.. విలువ ఎంతంటే.. | life insurance corporation of india reduced its stake in sun pharma stocks through open market operations

life insurance corporation of india reduced its stake in pharma company
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X