LIC: ఎల్ఐసీలో అద్భుతమైన టర్మ్ ప్లాన్.. రోజుకు రూ.24 లతో రూ.50 లక్షల ఇన్సూరెన్స్..!
భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక బీమా పాలసీలు తీసుకొచ్చింది. ఇందులో ఒకటి ఎల్ఐసీ యువ టర్మ్ (LIC Yuva Term/Digi Term) ఒకటి. ఇవి వివిధ బీమా అవసరాలను తీర్చడానికి తీసుకొచ్చారు. ఈ పాలసి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ పాలసీ. అంటే ప్యూర్-రిస్క్ అన్నమాట. కేవలం మరణ ప్రమాదానికి మాత్రమే వర్తించే ప్లాన్ ఇంది. పాలసీ కాలపరిమితిలో పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేలా 'LIC Yuva Term/Digi Term' పాలసీ తీసుకొచ్చింది. ఈ ఇన్సూరెన్స్ ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 45 ఏళ్లుగా ఉంది. మెచ్యూరిటీ పీరియడ్ 33 నుంచి 75 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇందులో బీమా మొత్తం రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. అధిక బీమా మొత్తానికి ఆకర్షణీయమైన రాయితీలు, మహిళలకు తక్కువ ప్రీమియం రేట్లు వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. రెగ్యులర్, పరిమిత ప్రీమియం చెల్లింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరణ ప్రయోజనం కింద వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు, లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105 శాతం లేదా నిర్ణీత బీమా మొత్తం. వీటిలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఒకేసారి ప్రీమియం చెల్లించే విధానంలో చెల్లించిన ప్రీమియంలో 125 శాతం లేదా నిర్ణీత బీమా మొత్తం. వీటిలో ఏది ఎక్కువైతే అది ప్రయోజనంగా లభిస్తుంది.

ఉదాహరణతో చూసినట్లయితే 30 ఏళ్లు ఉన్న ఒక ఎల్ఐసీ యువ టర్మ్ ప్లాన్ రూ.50 లక్షలకు తీసుకుని.. 50 ఏళ్ల వరకు(20 ఏళ్లు కాల వ్యవధి ఎంచుకుంటే), అలాగే ప్రీమియం చెల్లింపు 10 ఏళ్లు ఎంచుకుంటే.. వార్షికంగా చెల్లించే ప్రీమియం దాదాపు రూ.8,750 గా వచ్చే అవకాశం ఉంటుంది. రోజుకు రూ.24 చెల్లించాల్సి వస్తుంది. రోజుకు రూ.24 చొప్పున చెల్లించడం ద్వారా రూ.50 లక్షల బీమా పొందే అవకాశం ఉంది. ఈ పాలసీలో ప్రత్యేక సదుపాయం ఉంది. డెత్ బెనిఫిట్‌ను ఒకేసారి కాకుండా వాయిదాల రూపంలో పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నామినీ తనకు అనుకూలంగా 5, 10 లేదా 15 సంవత్సరాల కాలవ్యవధిలో విడతల వారిగా డెత్ బెనిఫిట్‌ను పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
