LIC: ఎల్ఐసీ నుంచి ధన్ వృద్ధి పథకం.. ఎలా ఉంటుందంటే..!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరో పాలసీ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త పథకానికి LIC ధన్ వృద్ధి అని పేరు పెట్టింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు ప్లాన్. ఈ ప్లాన్ పెద్ద మార్పు తీసుకురాగలదని LIC భావిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధన్ వృద్ధి ప్రణాళిక దేశీయ మార్కెట్ బీమా అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు, బీమా హోల్డర్ ఆర్థిక భద్రతను కూడా అందించనుంది. ఈ ప్లాన్ కింద, ప్రజలు సమగ్ర జీవిత బీమాను పొందుతారు.
ఇది భద్రత, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ బీమా పథకం 23 జూన్ 2023న ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ పాలసీ అందుబాటులో ఉండనుంది. తన కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు నిబంధనలను పటిష్టం చేస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఈ పాలసీ జీవిత బీమా సింగిల్-ప్రీమియం పాలసీ. ఈ పాలసీకి డెత్ బెనిఫిట్‌తో పాటు, మెచ్యూరిటీ తేదీలో గ్యారంటీతో కూడిన రాబడిని ఇస్తారు. ఈ పథకంలో రెండు ఆప్షన్లు ఉటాయి.

ప్రాధాన్యత ఆధారంగా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. మొదటి ఆప్షన్ లో చెల్లించిన ప్రీమియానికి 1.25 రెట్ల రాబడి వస్తుంది. రెండో ఆప్షన్ లో 10 రెట్ల వరకు కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ 10, 15 లేదా 18 ఏళ్ల కాలపరిమతితో అందుబాటులో ఉంది. పాలసీదారు సెక్షన్ 80-సి కింద పన్ను మినహాయింపుకు అర్హులు. అంటే ఈ పాలసీని కొనుగోలు చేసే బీమాదారులు రూ.1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. పాలసీ వ్యవధిలో పాలసీదారు ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థ. ఈ కంపెనీ ప్రతి వర్గానికి బీమా పాలసీని ప్రారంభించింది. ఇది పిల్లల నుంచి వృద్ధుల వరకు బీమా పథకాలను బీమా పథకాలు ప్రవేశపెట్టింది. ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా కంపెనీ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. అదే సమయంలో, మార్కెట్, ప్రజల అవసరాల ఆధారంగా, కొత్త పాలసీలను తీసుకువస్తోంది.


Click it and Unblock the Notifications