పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ స్థాయిలో ప్రతిఫలం అందితే ఎలా ఉంటుంది.. పెద్ద పండగలా ఉంటుంది. జీవిత బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఈ రంగంలోని కంపెనీలు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి వాటాదారులకు గత ఐదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా డివిడెండ్ చెల్లించాయి. దీంతో వాటాదారుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగంలోని జీవిత బీమా కంపెనీలు గడచిన ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 4,442 కోట్ల రూపాయల డివిడెండ్ ను చెల్లించాయి.
2017-18 ఆర్ధిక సంవత్సరంలో ఈ కంపెనీలు డివిడెండ్ 4,192 కోట్ల రూపాయలుగా ఉన్నది. ఒక్క ఏడాది కాలంలోనే డివిడెండ్ మొత్తం ఏకంగా 250 కోట్ల రూపాయలు పెరిగింది. దీంతో వాటాదారుల్లో సంబరం వ్యక్తం అవుతోంది. అంతకు మించి గత ఐదేళ్ల కాలంలో బీమా కంపెనీలు ఈ స్థాయిలో ఎన్నడూ డివిడెండ్ ను చెల్లించలేదు. ఇంతకు ముందు 2015-16 సంవత్సరంలో బీమా కంపెనీలు చెల్లించిన గరిష్ట మొత్తం 4,364 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఎల్ఐసి భారీ డివిడెండ్
* ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) భారీ స్థాయిలో ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి ఈ సంస్థ చెల్లించిన డివిడెండ్ 2,660 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఎల్ఐసి ప్రభుత్వానికి ఇచ్చిన డివిడెండ్ మొత్తం 2,421 కోట్ల రూపాయలకు పైగా ఉంది.
* ఎల్ఐసి ప్రీమియం ఆదాయం భారీ స్థాయిలో పెరుగుతోంది. ప్రయివేట్ కంపెనీలకు దీటుగా కొత్త ఉత్పత్తులు తెస్తూ ఈ సంస్థ తన మార్కెట్ వాటాను, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా కొత్త పాలసీదారులను పెంచుకునే అవకాశం కూడా ఏర్పడుతోంది.

ప్రైవేట్ కంపెనీలు...
* ప్రయివేట్ బీమా కంపెనీల డివిడెండ్ చెల్లింపు మొత్తం కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా ఏడూ బీమా కంపెనీలు అధిక డివిడెండ్ చెల్లించి వాటాదారులకు ప్రయోజనాన్ని కల్పించాయి. వీటిలో హెచ్ డీ ఎఫ్ సి లైఫ్, ఐసీఐ సి ఐ ప్రుడెన్షియల్, మాక్స్ లైఫ్, ఎస్ బీ ఐ లైఫ్, బజాజ్ అలెయంజ్, శ్రీరామ్ లైఫ్, స్టార్ యూనియన్ ధై చి లైఫ్ ఉన్నాయి.
* ప్రయివేట్ రంగ బీమా కంపెనీల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సత్తా చాటుకుంటోంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 18 శాతం వరకు ఉండటం విశేషం. ఇదేకాలంలో ఈ కంపెనీ చెల్లించిన డివిడెండ్ మొత్తం 703 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఇది అంతకు ముందు ఆర్ధిక పోల్చితే మాత్రం తక్కువే.
* హెచ్ డీ ఎఫ్ సి లైఫ్ గత ఆర్థిక సంవత్సరంలో 329 కోట్ల రూపాయలు, మాక్స్ లైఫ్ , ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలేయంజ్ కంపెనీలు వరుసగా 397 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు, 105 కోట్ల రూపాయల డివిడెండ్ చెల్లించాయి.

ఇదీ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీల పరిస్థితి
* గత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని నాలుగు సాధారణ బీమా కంపెనీలు మాత్రం డివిడెండ్ ను చెల్లించలేదు. 2017-18 సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా ఆస్స్యూరెన్సు కంపెనీ ఒక్కటి మాత్రమే 309 కోట్ల రూపాయల డివిడెండ్ ను చెల్లించింది.
* కానీ ప్రయివేట్ రంగంలోని జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలు మాత్రం 618 కోట్ల డివిడెండ్ చెల్లించడం విశేషం. అయితే అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే మాత్రం డివిడెండ్ మొత్తం కాస్త తగ్గింది.

లాభాలు తగ్గాయ్..
* గత ఆర్ధిక సంవత్సరంలో జీవిత బీమా కంపెనీల మొత్తం లాభం 8,436 కోట్ల రూపాయలు గా నమోదయింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో లాభం 8,512 కోట్ల రూపాయలుగా ఉంది.
* 24 జీవిత బీమా కంపెనీలో 20 కంపెనీలు లాభాలను నమోదు చేసుకున్నాయి.
* గత ఆర్ధిక సంవత్సరంలో ఎల్ఐసి లాభం 2,689 కోట్ల రూపాయలుగా నమోదయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications