ముంబై: LIC హౌడింగ్ ఫైనాన్స్ షేర్లు సోమవారం 12 శాతం పడిపోయాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో IDBI బ్యాంకును విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఎల్ఐసీ ప్రకటించింది. దీంతో సోమవారం బీఎస్ఈలో LIC హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 12.32 శాతం పడిపోయి రూ.361.3 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని రూ.380 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో రూ.412.05 వద్ద ముగిసింది.
LIC హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,700 కోట్లుగా కాగా, IDBI బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,214 కోట్లు. IDBIలో ఎల్ఐసీ వాటా 51 శాతంగా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 40.13 శాతంగా ఉంది. ఇంట్రాడేలో 2.06 శాతం తగ్గి రూ.354తో 52 వారాల కనిష్టానికి పడిపోయింది.

ఇదిలా ఉండగా, 126 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో ఏ2జడ్ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, అడ్రోయిట్ ఇన్ఫోటెక్, ఆగ్రో ఫోస్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, అంబికా కాటన్ మిల్స్, ఆంధ్రా పేపర్, ఆర్కిడ్‌ప్లే ఇడస్ట్రీస్, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఆర్టిమిస్ మెడికేర్ సర్వీసెస్, ఏటీఎన్ ఇంటర్నేషనల్, అరిన్‌ప్రొ సొల్యూషన్స్, ఆటోమోటివ్ యాక్సెల్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications