చైనా సంస్థలకు సంబంధించిన 59 చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చైనా దిగుమతులపై కూడా ఆంక్షలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కొన్ని చైనా ప్రొడక్ట్స్ దిగుమతులకు ప్రభుత్వం నుండి లైసెన్స్ తప్పనిసరి. అయితే ఇప్పటికే కొన్ని ప్రోడక్ట్ లపై లైసెన్స్ విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో మరికొన్నింటిని కూడా ఈ లిస్టులో చేర్చడానికి గైడ్ లైన్స్ ని రెడీ చేస్తుంది వాణిజ్య మంత్రిత్వ శాఖ.
ఇప్పటికే చైనా నుండి దిగుమతి అయ్యే పామాయిల్, టైర్లు, అగర్బత్తీలు వంటి ప్రొడక్టులకు ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. ఎయిర్ కండిషనర్లు మరియు దానిలోని అనేక భాగాలు మరియు టెలివిజన్ సెట్ల యొక్క 10-12 రకాల ముడి వస్తువుల దిగుమతికి లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే దేశంలోకి విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించాలని ముఖ్యంగా చైనా నుండి దిగుమతులు బాగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

లడఖ్ సరిహద్దుపై ఉద్రిక్తత పెరగడంతో ఎయిర్ కండిషనర్లు మరియు దాని భాగాలు వంటి ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడంపై దృష్టి దృష్టి పెట్టిన ప్రభుత్వం డజను వస్తువుల దేశీయ ఉత్పత్తిని పెంచే కసరత్తు మొదలు పెట్టింది. కస్టమ్స్ సుంకం పెంచడం మరియు సాంకేతిక ప్రమాణాలు, పేర్కొన్న ఓడరేవుల నుండి మాత్రమే నిర్దిష్ట వస్తువుల దిగుమతులకు లైసెన్సింగ్ ఇవ్వడం తదితర చర్యల ద్వారా దిగుమతులను తగ్గించవచ్చని భావిస్తుంది సర్కార్.
చైనా దిగుమతుల లిస్ట్‌లో ఏసీలతో పాటు స్టీల్, అల్యు మినియం, ఫుట్ వేర్, బంగాళదుంపలు, ఆరెంజ్ లు వంటివి ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు లిథియం ఐయాన్ బ్యా టరీస్, యాంటిబయాటిక్స్ , పెట్రోకెమికల్స్, ఆటో, మొబైల్ పార్టులు, టాయ్స్ , స్పోర్ట్స్ గూడ్స్, టీవీ సెట్లు, సోలార్ ఎక్వి ప్ మెంట్లు ,ఎలక్ట్రా నిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వంటివి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ లిస్ట్‌లో చేర్చనుందని తెలుస్తుంది. లైసెన్సింగ్ విధానాన్ని తీసుకు రావడానికి కావాల్సిన గైడ్ లైన్స్ ను రూపొందిస్తున్న క్రమంలో త్వరలోనే లైసెన్స్ విధానం చైనా దిగుమతులపై రానుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications