ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీ(LIC) మరోసారి కేంద్ర ప్రభుత్వానికి భారీగానే నిధులు జమ చేసింది. ఈసారి ఎల్‌ఐసీ రూ.3,662 కోట్లకు పైగా డివిడెండ్ ను ప్రభుత్వానికి చెల్లించింది. ఎల్ఐసీ అధికారులు డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఎల్ఐసీలో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ఎల్‌ఐసికి చెందిన 632.49 కోట్ల పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లలో, ప్రభుత్వానికి 610.36 కోట్ల షేర్లు ఉన్నాయి. ఎల్ఐసీలో భారత ప్రభుత్వానికి 96.50 శాతం వాటా ఉంది.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాటా 75 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండేది. IPOలో కొంత వాటాను విక్రయించింది. అన్ని కంపెనీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో తమ వాటాదారులకు అందజేస్తాయి. అందులో భాగంగానే ఎల్ఐసీ తన ఆదాయాలలో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో తన వాటాదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. అతిపెద్ద వాటాదారుగా ఉన్న భారత ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది.

ఈ తాజా డివిడెండ్ చెల్లింపు ఇటీవల ఎల్‌ఐసి వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో ఆమోదించారు. ప్రభుత్వ బీమా కంపెనీ ఏజీఎం ఆగస్టు 22న జరిగిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరానికిగానూ ఒక్కో షేరుకు రూ.6 తుది డివిడెండ్‌ను తమ వాటాదారులకు చెల్లించనున్నట్లు కంపెనీ మే నెలలో ప్రకటించింది. అంతకు ముందు, మార్చి 1, 2024న కంపెనీ మధ్యంతర డివిడెండ్‌గా ప్రభుత్వానికి రూ.2,441.45 కోట్లు చెల్లించింది. ఈ
విధంగా గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఎల్‌ఐసీ అందించిన వాటా రూ.6,100 కోట్లను చేరింది. ఎల్ఐసీ ఐపీఓ మే 2022లో వచ్చింది. ఐపీఓలో ప్రైస్ బ్యాండ్ రూ.902 నుంచి రూ.949గా నిర్ణయించారు. ఐపీఓకి స్పందన బాగానే వచ్చింది... కానీ దాని లిస్టింగ్ డిస్కౌంట్ లో అయింది. ఎల్ఐసీ షేర్లు రూ.867 వద్ద లిస్టయ్యాయి. తర్వాత మార్కెట్ ట్రేడింగ్‌లో ఒక్కసారిగా షేరు ధర రూ.600 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఒక షేరు రూ.1,071 వద్ద ట్రేడవుతోంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications