Health Insurance: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతోంది. కొత్త విభాగాల్లో అడుగుపెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన తరుణంలో అందుకు తగిన విధంగా మార్గం సిద్ధం చేసుకుంటోంది.
జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా మార్కెట్‌లోకి ప్రవేశించాలని LIC భావిస్తోంది. బహుళ బీమా ప్రయోజనాలను సింగిల్ పాలసీతో అందించే యోచనలో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ ఉన్న వేళ.. సంస్థ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న LIC.. హెల్త్ విభాగంలోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

సామాన్యులపై బీమా ఖర్చులను తగ్గించడానికి అందుబాటులోని పలు మార్గాలను పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలిస్తోంది. ప్రజలపై భారాన్ని తగ్గించడానికి మిశ్రమ బీమా పాలసీలను రూపొందించాలని సిఫార్సు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జారీచేయబడిన 55 కోట్లలో ఆరోగ్య బీమా పాలసీలు అత్యంత తక్కువగా 2.3 కోట్లు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ఇక ఈ సంవత్సరం LIC ప్రతి షేరుకు 6 చొప్పున చివరి డివిడెండ్‌ను ప్రకటించింది. జూలై 19న పేఅవుట్ రికార్డ్ డేట్‌గా ప్రతిపాదించింది. సంస్థలో భారత ప్రభుత్వం 96.5 శాతం వాటా కలిగి ఉండటంతో 3 వేల 662 కోట్ల గణనీయమైన డివిడెండ్‌ను అందుకోనుంది. ఇటీవల RBI నుంచి కూడా భారీ మొత్తంలో కేంద్రం డివిడెండ్‌ను సంపాదించగా.. మరోసారి LIC రూపంలో జాక్‌పాట్ కొట్టనుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications