ఈ రోజుల్లో పిల్లల చదువులు ఇంకా పెళ్లికి ప్రతి ఒక్క తల్లితండ్రులు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలంటి సమయంలో మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు కావాలన్నా కూడా సేకరించలేరు. అందుకే చాలా మంది చిన్న చిన్న సేవింగ్స్ చేస్తూ పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో కూడబెడుతుంటారు. అయితే అలంటి ఈ LIC చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ గురించి తెలుసా...

ఈ LIC పాలసీలో మీరు రోజుకు రూ. 150 డిపాజిట్ చేయాలి. దింతో మెచ్యూరిటీ సమయం వచ్చాక మీ దగ్గర రూ.19 లక్షల మొత్తం ఉంటుంది. ఇలా మీరు కూడా మీ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు కోరుకుంటే మీరు LIC చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ గురించి తెలుసుకోవాల్సిందే..
LIC చిల్డ్రన్ మనీ బ్యాక్ స్కిం : LIC ఈ పథకంలో కనీసం 0 సంవత్సరాలు నుండి గరిష్టంగా 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 25 సంవత్సరాలు. ఉదాహరణకు మీ పిల్లలకి 5 సంవత్సరాలు అని అనుకుందాం, అప్పుడు మీ పాలసీ 20 సంవత్సరాల తర్వాత అంటే మీ బిడ్డకు 25 సంవత్సరాల వయస్సు వచ్చాక మెచ్యూరిటీ అవుతుంది.
25 సంవత్సరాల వయస్సులో మెచ్యూరిటీ కాలం: LIC చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి 25 సంవత్సరాల వయస్సులో ఉంటుంది. ఈ పాలసీలో ప్రైమరీ హామీ మొత్తంలో 20 శాతం 18, 20 ఇంకా 22 సంవత్సరాల వయస్సులో ఉంటుంది. అలాగే, 25 సంవత్సరాల వయస్సులో బోనస్‌తో పాటు 'మెచ్యూరిటీపై హామీ మొత్తం' పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో అందుకున్న హామీ మొత్తం 'ప్రాథమిక హామీ మొత్తం (ఇన్సూరెన్స్ మొత్తం)'లో 40 శాతానికి సమానం.
మీకు 25 సంవత్సరాలలో 19 లక్షల మొత్తం లభిస్తుంది: మీకు బిడ్డ పుట్టినప్పటి నుండి మీరు ఈ LIC చిల్డ్రన్ మనీ బ్యాక్ స్కీమ్‌లో కేవలం రూ. 150 పెట్టుబడి పెడితే (అయితే, దీని ప్రీమియం అన్యువల్, 6 నెలలు, త్రైమాసిక లేదా ప్రతినెల ప్రాతిపదికన ఉంటుంది), అప్పుడు మీరు 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలంలో దాదాపు రూ. 19 లక్షలు పొందుతారు. మీరు ఈ లెక్కన పరిశీలిస్తే రోజుకు రూ. 150 చొప్పున, మీరు సంవత్సరానికి రూ. 55,000 డిపాజిట్ చేస్తారన్నమాట. దీని ఆధారంగా 25 సంవత్సరాలలో మొత్తం రూ.14 లక్షలు డిపాజిట్ చేసి ఉంటుంది. కానీ వడ్డీ ఇంకా బోనస్‌తో మీకు రూ. 19 లక్షలు లభిస్తాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications