LIC: ఎల్ఐసీ సరికొత్త రికార్డు.. ఒకే ఒక్క ఇండియన్ కంపెనీగా..!!
LIC News: ఇన్సూరెన్స్ అనగానే ముందుగా ప్రతి భారతీయుడికీ కనిపించే, వినిపించే మెుదటి కంపెనీ ఎల్ఐసీ. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న దీనిపై భారతీయలకు అమితమైన నమ్మకం. ఇది వివిధ కేటగిరీ ప్రజల అవసరాల కోసం ప్రత్యేక పాలసీలను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీగా కొనసాగుతోంది. అయితే ప్రపంచ స్థాయిలో కంపెనీ నాలుగో స్థానంలో ఉందని S&P గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఎల్ఐసీ మెుత్తం నగదు నిల్వలు 503.7 బిలియన్లుగా ఉన్నాయి. అయితే ప్రపంచంలోని టాప్-50 ఇన్సూరెన్స్ కంపెనీల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీగా ఎల్ఐసీ నిలిచింది.

మెుదటి స్థానంలో ఉన్న జర్మన్ కంపెనీ అలియన్జ్ SE నగదు నిల్వలు 750.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెండవ స్థానంలో నిలిచిన చైనా లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ నగదు నిల్వలు 616.9 బిలియన్ డాలర్లుగా ఉండగా.. మూడో స్థానంలో ఉన్న నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ నగదు నిల్వలు 536.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇన్సూరెన్స్ వ్యాపారంలో 6 యూరోపియన్ దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. జాబితాలో ఈ దేశాలకు చెందిన 21 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. బ్రిటన్ నుంచి గరిష్టంగా ఆరు కంపెనీలు ఈ జాబితాలో నిలిచాయి. ప్రపంచ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో భారత్ వాటా 1.9 శాతం మాత్రమే. భారత మార్కెట్‌లో ఎల్‌ఐసీ ఆధిపత్యంతో టాప్ జాబితాలో కొనసాగుతోంది. ప్రీమియం ఆదాయం పరంగా భారతదేశం 2023లో ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. 2022లో భారత్ ర్యాంకింగ్ తొమ్మిదో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications