SEBI on LIC: ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ. నేడు కంపెనీకి సెబీ నుంచి కీలకమైన అనుమతి లభించటంతో స్టాక్ ఇంట్రాడేలో 4 శాతానికి పైగా లాభపడింది.
వివరాల్లోకి వెళితే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఎల్ఐసీకి కంపెనీలో 10 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ కలిగి ఉండేందుకు గడువును 3 ఏళ్ల పాటు పొడిగించింది. ఎల్ఐసీ షేర్ హోల్డింగ్ నిబంధనను అందుకునేందుకు డెడ్ లైన్ తాజా పరిణామాలతో మే 16, 2027 వరకు పొడిగించబడింది. వాస్తానికి కంపెనీ ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేసి పబ్లిక్‌గా మారిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తాజా పరిణామం చేటుచేసుకుంది. ఈ వార్తలో ఇన్వెస్టర్లలో సంతోషం ఒక్కసారిగా పెరిగింది. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ ధర ఒక్కోటి 4.15% లాభంతో రూ.969.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

వాస్తవానికి మార్చి 31, 2023 నాటికి ఇన్సూరెన్స్ దిగ్గజంలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 3.5 శాతంగా ఉంది. అయితే సెబీ సూచన ప్రకారం కంపెనీ 10 శాతం కనీస పబ్లిక్ వాటాను సాధించడానికి రానున్న మూడేళ్ల కాలంలో 6.5 శాతం వాటాను తగ్గించుకోవాల్సి ఉంది. కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు అన్ని లిస్టెడ్ కంపెనీలకు కనీసం 25 శాతం పబ్లిక్ ఫ్లోట్‌ను తప్పనిసరిగా ఉంది.
మే 2022లో ఎల్ఐసీ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఐపీవోను ఈక్విటీ మార్కెట్లలోకి ఫ్లోట్ చేసింది. దీనిలో భారత ప్రభుత్వం కంపెనీలోని తన 3.5 శాతం వాటాని ఏకంగా రూ.21,000 కోట్లకు విక్రయించింది. అయితే కంపెనీ షేర్ల లిస్టింగ్ పెట్టుబడిదారులకు కన్నీటిని మిగిల్చిన విషయం ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. వాస్తవానికి మే 17, 2022లో కంపెనీ షేర్లను గరిష్ఠ ధర రూ.949కి విక్రయించినప్పటికీ 9 శాతం డిస్కౌంట్ రేటు రూ.867 వద్ద షేర్లు జాబితా అయ్యాయి. ఎల్ఐసీ ఐపీవోకి వచ్చిన హైప్ తో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును అందులో పెట్టిన సంగతి తెలిసిందే. లిస్టింగ్ తర్వాత కుప్పకూలిన స్టాక్ ప్రస్తుతం మార్కెట్లో ఐపీవో ధర కంటే కొంచెం ఎక్కువ రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
నవంబర్ 2023 వరకు లిస్టింగ్ ధర నుంచి 26 శాతం క్షీణించిన ఎల్ఐసీ స్టాక్ తిరోగమన ధోరణిలో కొనసాగాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో వాటాను పెంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీకి అనుమతించిన తర్వాత జనవరి 30న తొలిసారిగా షేర్లు మార్కెట్లలో ఐపీవో ఇష్యూ సమయంలోని ధరను అధిగమించాయి. ఇదే క్రమంలో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 49 శాతం పెరిగి రూ.9,441 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications