LIC News: LIC స్టాక్ భారీ ర్యాలీ.. రెండు రికార్డులు సొంతం.. ఇవీ రీజన్స్
Stock market news: దేశీయ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) స్థాయి వేరు. వివిధ రకాల ఆకర్షణీయమైన ప్లాన్లతో సామాన్యులకు సైతం చేరువైంది. కేంద్రం నిర్ణయంతో IPOగా మార్కెట్లోకి వచ్చింది. కానీ ఇన్వెస్టర్లు ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇండియాలోని అతిపెద్ద జీవిత బీమా కంపెనీ LIC షేర్లలో ఇవాళ బలమైన ర్యాలీ కనిపించింది. తొలిసారిగా స్టాక్ విలువ వెయ్యి రూపాయలను దాటింది. మార్కెట్ క్యాప్ కాస్తా 6 లక్షల కోట్ల మార్కును దాటి అతిపెద్ద PSUగా అవతరించింది. నవంబర్ 29న జీవన్ ఉత్సవ్ అనే స్కీమ్‌ను ప్రారంభించడం, రాబోయే రోజుల్లో మరో 4 ప్లాన్స్ స్టార్ట్ చేయడం, HDFCలో తన వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు RBI ఆమోదించడం ఈ ర్యాలీకి కారణమని భావిస్తున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో 7 శాతానికి పైగా పుంజుకుని 1014 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో ఇంట్రా-డేలో 1027.05 గరిష్ట స్థాయిని తాకింది. అయితే గతేడాది మార్చి 29న ఏడాది కనిష్ఠ స్థాయి 530.20కి చేరి ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమైంది. 11 నెలల్లో దాదాపు 94 శాతం ఎగబాకి ఇప్పుడు రికార్డు స్థాయికి ఎగబాకింది.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం మే 2022లో 949 ధరకు ఈ షేర్లు జారీచేయబడ్డాయి. అప్పట్లో రిటైల్ ఇన్వెస్టర్లు మరియు ఉద్యోగులు 45 తగ్గింపుతో, పాలసీదారులు 60 తగ్గింపుతో పొందారు. గత నెలలోనే మార్కెట్ క్యాప్ పరంగా LIC అతిపెద్ద PSUగా నిలిచింది. SBI ప్రస్తుత మార్కెట్ క్యాప్ 5.79 లక్షల కోట్లు కాగా LIC 6.37 లక్షల కోట్లతో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications