LIC Stock: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్ఐసీ. ఇన్సూరెన్స్ అనగానే భారతీయులకు గుర్తుకొచ్చే సంస్థ ఇది. దీనికి తోడు చాలా మంది తమ డబ్బును పెట్టుబడి రూపంలో ఎక్కువగా ఈ కంపెనీలోనే పెట్టేందుకు ఇష్టపడుతుంటారు.
స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎల్ఐసీ స్టాక్ ధర నేడు ఇంట్రాడేలో 9.7% బలమైన పెరుగుదలను నమోదు చేసింది. దీంతో స్టాక్ నేడు 10 వారాల గరిష్ఠ ధర అయిన రూ.677.65ను తాకింది. మే 2022లో లిస్టింగ్ చేసినప్పటి నుండి అతిపెద్ద ఇంట్రాడే లాభంగా కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ సమయంలో అత్యధికంగా రూ.682 ధరను అందుకుంది.

FY24 కోసం కొత్త వ్యాపార ప్రీమియంలలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యానికి అనుకూలంగా చెప్పుకోదగిన పురోగతిని కంపెనీ నమోదు చేసింది. ఇటీవలి ట్రెండ్ వ్యక్తిగత రిటైల్ వ్యాపారంలో పురోగతిని చూపుతున్నందున తాము లక్ష్యాన్ని చేరుకోగలమని నమ్మకంగా ఉన్నట్లు ఎల్‌ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి వెల్లడించారు. ఇందుకోసం కొన్ని కొత్త ఆకర్షణీయమైన ఉత్పత్తులను ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వీటిలో మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారు జీవితకాల బీమా మొత్తంలో 10 శాతం పొందుతారని మహంతి తెలిపారు.
దేశంలోని బీమా మార్కెట్లో ఎల్ఐసీ ఏకంగా 58.50 శాతం సింహభాగంతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. H1FY24 కోసం దాని కొత్త బిజినెస్ ప్రీమియం H1FY23లో రూ.24,535 నుంచి 2.65% పెరిగి రూ.25,184 కోట్లకు చేరుకుంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు సెప్టెంబర్ 30, 2022లో ఉన్న రూ.42,93,778 కోట్లతో పోలిస్తే10.47 శాతం పెరిగి సెప్టెంబర్ 30, 2023 నాటికి రూ.47,43,389 కోట్లకు పెరిగింది.

ఎల్ఐసీ ఐపీవో మే 17, 2023న మార్కెట్లోకి వచ్చింది. వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.902 నుంచి రూ.949గా ఐపీవోకి ఫిక్స్ చేసింది. అయితే లిస్టింగ్ సమయంలో ఇష్యూ ధర కంటే 8.62 శాతం డిస్కౌంట్ రేటు వద్ద షేర్లు జాబితా అయ్యాయి. ఆ రోజు స్టాక్ రూ.875.25 వద్ద ప్రయాణాన్ని ముగించాయి. ఆ తర్వాత షేర్ ధర భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే వారంలో షేర్ ధర రూ.800కి చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ ఈక్విటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్ రాజేష్ భోసలే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications