LIC Share: ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు లాభాల పూనకాలు.. దిమ్మతిరిగే సర్‌ప్రైజ్..
LIC News: ఎల్ఐసీ అనే పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది నమ్మకం, భద్రత. అవును ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బీమా సంస్థ ప్రపంచంలోని టాప్-5 ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటిగా ప్రస్తుతం కొనసాగుతోంది.
ఐపీవోగా మార్కెట్లోకి అనేక అంచనాలతో వచ్చిన ఇన్సూరెన్స్ దిగ్గజం ఆ తర్వాత ఇన్వెస్టర్ల సొమ్మును నిండా ముంచి కొంత నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా అధిక వ్యాల్యుయేషన్ల వల్లే జరిగిందని తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడు మాత్రం పెట్టుబడిదారులకు మంచి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. గడచిన రెండు నెలలుగా ఎల్ఐసీ స్టాక్ భారీగా పెరిగింది. ఈ కాలంలో షేరు ధర దాదాపు 45 శాతం పెరిగి రూ.615 నుంచి రూ.893కి చేరుకుంది. అలాగే గత మంగళవారం స్టాక్ తొలిసారిగా బీఎస్ఈలో రూ.900 మార్కును తాకింది. దాదాపు 20 నెలల తర్వాత ఈ స్థాయికి షేర్ ధర చేరుకుంది.

చాలా కాలం తర్వాత స్టాక్ గరిష్ఠాలకు చేరుకోవటంతో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను మెుగ్గుచూపారు. దీంతో షేర్ ధర స్వల్పంగా క్షీణతను నమోదు చేసింది. చాలా కాలంగా నష్టాలతో నిరాశకు గురైన పెట్టుబడిదారులకు ప్రస్తుత ర్యాలీలో మంచి ఊరట లభించింది. ప్రస్తుతం కంపెనీ ఈక్విటీ షేర్ల మార్కెట్ విలువ దాదాపు రూ.5.60 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో LIC 10వ స్థానానికి చేరుకుంది. ఎస్బీఐ తర్వాత విలువైన ప్రభుత్వ సంస్థగా కొనసాగుతోంది.
2022 మే నెలలో పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందే ఉద్దేశ్యంతో ఎల్ఐసీ లాంటి పెద్ద కంపెనీలో పెట్టుబడి సరైనదిగా భావించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రోకరేజ్ కంపెనీలు ఎల్ఐసీ స్టాక్ టార్గెట్ ధరను రూ.949గా అంచనా వేస్తున్నారు. ఐపీవో తర్వాత ఎల్ఐసీ స్టాక్ ధర రూ.530 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవటం ఇన్వెస్టర్లలో పెద్ద భూకంపాన్ని కలిగించింది.


Click it and Unblock the Notifications