LIC Share: ఇన్వెస్టర్లను నిండా ముంచిన ఎల్ఐసీ.. నిపుణులు ఏమంటున్నారంటే..
LIC Share: మార్కెట్లోకి ఐపీవోగా ఎల్ఐసీ వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఈ క్రమంలో స్టాక్ పతనం కోటి ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లకు మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలో బ్రోకరేజీలు స్టాక్ గురించి ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం..
దాదాపు ఏడాది తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ ధర రూ.600 దిగువకు పడిపోయింది. ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన అనేక మంది రిటైలర్లు అతిపెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2.23 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. ఇదే క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.3.77 లక్షల కోట్లకు పడిపోయింది.

స్టాక్ మార్కెట్ల చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా నిలిచిన ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించింది. దీని ద్వారా మార్కెట్లో 22.13 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.949 చొప్పున విక్రయించింది. అయితే ప్రస్తుతం బీమా దిగ్గజం స్టాక్ ధర ఐపీవో నాటితో పోల్చితే దాదాపు 37 శాతం తక్కువగా ఉంది. దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత కూడా ఇన్వెస్టర్లకు ఉపసమనం లభించలేదు. మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించినప్పటికీ LICకి ప్రస్తుతం 'SELL' రేటింగ్ ఇవ్వబడలేదు. అలాగే షేర్లను అమ్మేయాలని బ్రోకరేజీలు సైతం సూచించటం లేదు.

ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం..15 మందిలో 12 మంది నిపుణులు ఎల్ఐసీ షేర్లకు BUY రేటింగ్ కేటాయించాయి. ఇదే సమయంలో ముగ్గురు మాత్రం హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. వీరు షేరుకు రూ.807ను సగటు టార్గెట్ ధరగా నిర్ణయించారు. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ షేర్లకు రూ.1000 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఇదే సమయంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ.917ను టార్గెట్ ధరను కొనసాగిస్తోంది. అలాగే JM ఫైనాన్షియల్ రూ.940 టార్గెట్ ధరతో బై రేటింగ్ కొనసాగించింది. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి ఈరోజు ఎల్ఐసీ స్టాక్ ధర రూ.596.85గా ఉంది.


Click it and Unblock the Notifications