లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో ద్వారా రూ.65,400 కోట్లు (8.7 బిలియన్ డాలర్లు) సమీకరించాలని భావిస్తోందట. ఎల్ఐసీ ఒక్కో షేర్ ధర రూ.2000 నుండి రూ.2100 వరకు ఉండవచ్చు. కొంతమంది రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ ఉండనుంది. ఎల్ఐసీ పాలసీదారులకు 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఎల్ఐసీ ఐపీవో మార్చి 10వ తేదీ నుండి 14వ తేదీ మధ్య ఉండవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించి రోడ్ షో ప్రారంభమైంది.

నిధుల సమీకరణ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో అసెట్ సేల్ టార్గెట్ అందుకోవడానికి మోడీ ప్రభుత్వానికి రూ.63,000 కోట్లు అవసరం. దేశంలో అతిపెద్ద ఐపీవో ఇది కాబోతుంది. ఎల్ఐసీ 16,940 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు మార్చి 9న అలాట్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద ఎల్ఐసీ ఈ నెల 13వ తేదీన డ్రాఫ్ట్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రూ.65,000 కోట్లకు పైగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెలలో స్టాక్ మార్కెట్లను తాకే ఎల్ఐసీ ఐపీవోలో ఉద్యోగులు, పాలసీదారులు రాయితీపై షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేయవలసి ఉంటుంది.

5 శాతమే
ఎల్ఐసీలో ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. ఐపీవో ద్వారా కేవలం 5 శాతం మాత్రమే విక్రయిస్తుంది. కంపెనీ ఎంబెడెడ్ వ్యాల్యూ అంటే కంపెనీ ఆస్తుల నికర వ్యాల్యూ, భవిష్యత్తు లాభాల ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం రూ.5.4 లక్షల కోట్లుగా నిర్ధారించినట్లు డీఆర్‌హెచ్‌పీలో ప్రభుత్వం తెలిపింది. బమా కంపెనీల మార్కెట్ వ్యాల్యూను అంచనా వేయడానికి ఎంబెడెడ్ వ్యాల్యూ అవసరం. బీమా రంగంలోని కంపెనీల ఎంబెడ్డ్ వ్యాల్యూ 3 రెట్ల మార్కెట్ వ్యాల్యూ ప్రామాణికం. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.15 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

డిపాజిట్ నిబంధన నుండి మినహాయింపు
ఐపీవో ప్రక్రియలో సెక్యూరిటీ డిపాజిట్ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబిని ఎల్ఐసీ కోరింది. ఎందుకంటే ఐపీవోకు వచ్చే కంపెనీలు ఇష్యూ సైజ్‌లో ఒక శాతానికి సమానమైన సొమ్మును స్టాక్ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఐపీవో మోసాలను అరికట్టడమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశ్యం.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications