Hot favourite stock: మారుతున్న కాలానికి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స హౌస్‌లు, ఇన్వెస్టర్లు తమ స్ట్రాటజీని మారుస్తూ ఉంటారు. తమ పెట్టుబడిని మరింత పెంచుకునేందుకు మంచి, క్వాలిఫైడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. లీడింగ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ LIC సహా దిగ్గజ ఫండ్ హౌస్ పెట్టుబడి పెట్టిన ఈ స్టాక్ పై ఇన్వెస్టర్ల కన్ను పడింది.
స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ (SEL) అనే కంపెనీ రియల్ ఎస్టేట్, టెక్స్‌టైల్స్, ఆయిల్&గ్యాస్, డిఫెన్స్, కమర్షియల్ షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్లు, హెవీ ఫ్యాబ్రికేషన్లలో నిమగ్నమై ఉంది. గతేడాది SEL 190.13 శాతం అసాధారణ పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా, గత మూడు సంవత్సరాలుగా అదే విధమైన పనితీరును కనబరిచింది. ఆకట్టుకునే స్థాయిలో 397.35 శాతం రాబడితో మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారింది.

ఇటీవల క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్లేస్‌మెంట్ (QIP)ని SEL విజయవంతంగా పూర్తి చేసింది. దీని ద్వారా 3 వేల కోట్లను సమీకరించింది. ఈ నిధులను వ్యూహాత్మక కార్యక్రమాల కోసం కేటాయించింది. ప్రధానంగా గతంలో కొనుగోలు చేసిన రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (RNEL) షిప్‌యార్డ్‌ను ఆధునీకరించడంపై దృష్టి సారిస్తోంది. ఆదాయంలో కొంత భాగాన్ని ప్రాజెక్ట్ విస్తరణ మరియు రుణ తగ్గింపు ప్రయత్నాలకు వినియోగించాలని నిర్ణయించింది.
క్వాంట్ మ్యూచువల్ ఫండ్, SBI, LIC, టాటా మ్యూచువల్ ఫండ్, BNP పారిబాస్ మ్యూచువల్ ఫండ్ సహా అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారుల దృష్టిని QIP ఆకర్షించింది. అంతేకాకుండా డైమండ్ ఆసియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ITI మ్యూచువల్ ఫండ్, గోల్డ్‌మన్ సాక్స్, ఫ్యూచర్ జెనరాలి, ఆనంద్ రాఠి మరియు అనేక ఇతర దేశవిదేశీ సంస్థలకు హాట్ ఫేవరెట్‌గా నిలిచింది.
ప్రఖ్యాత గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థను భాగం చేయడం, అగ్రశ్రేణి పరిశ్రమ ప్రతిభను నియమించుకోవడం ద్వారాజూన్ 2024 నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వాన్ గ్రూప్ ప్రత్యేక విభాగం ఈ కార్యకలాపాల డిమాండ్లను తీర్చడానికి.. సేకరణ మరియు సరఫరా గొలుసు నిర్వహణను పర్యవేక్షిస్తోంది. చురుగ్గా మానవ వనరుల సమీకరణతో పాటు చట్టపరమైన అవసరాలకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


Click it and Unblock the Notifications