LIC Policy: ప్రజలు మెచ్చిన పాలసీ.. 10 రోజుల్లో చాలా మంది కొన్నారు.. ప్రయోజనాలు ఇవే
LIC Policy: దేశంలో మారుమూల ప్రజలకు సైతం చేరువైన పెట్టుబడి ఎంపికల్లో ఎల్ఐసీ అగ్ర స్థానంలో ఉంది. దీని తర్వాత పోస్టల్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రజలకు ఇన్సూరెన్స్ ఎంత అవసరం అనే అంశం కరోనా తర్వాత మరింతగా అర్థమైంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఎల్ఐసీ వివిధ అవసరాలకు, వివిధ రకాల కస్టమర్లకు అనుకూలమైన పాలసీలను ప్రవేశపెడుతుంటుంది.

ప్రజలు మెచ్చిన పాలసీ..
ఎల్ఐసీ ఇటీవల ప్రవేశపెట్టిన Jeevan Azad పాలసీ మంచి స్పందనను పొందింది. కేవలం 10-15 రోజుల్లో దాదాపు 50,000 పాలసీలు అమ్ముడయ్యాయని ఛైర్మన్ ఎమ్ఆర్ కుమార్ వెల్లడించారు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నాన్ పార్టిసిపేటింగ్ స్కీమ్ అని ఆయన తెలిపారు. ఈ పాలసీని జనవరి 2023లో కొత్తగా ఎల్ఐసీ లాంచ్ చేసింది. అనతి కాలంలోనే పాలసీ మంచి గుర్తింపు పొందటానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జీవన్ ఆజాద్..
జీవన్ ఆజాద్‌లో ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ వ్యవధి నుంచి ఎనిమిది సంవత్సరాలు తొలగించబడుతుంది. ఉదాహరణకు పాలసీ పెట్టుబడి కాలం 18 ఏళ్లయిటే అందులో నుంచి 8 ఏళ్ల కాలాన్ని తగ్గించటం జరుగుతుంది. మిగిలిన 10 ఏళ్ల కాలానికి పాలసీదారులు సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది. ఈ పాలసీ కింద కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ప్రాథమిక హామీ మెుత్తం ఉంటుంది. పాలసీని 15-20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.

LIC లాభాలు..
ఎల్ఐసీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మంచి ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో కంపెనీ నికర లాభం రూ.6,334 కోట్లకు చేరుకుంది. నాన్ పార్టిసిటింగ్ ఫండ్ నుంచి షేర్ హోల్డర్స్ ఫండ్‌కు రూ.5,670 కోట్లను బదిలీ చేయడం వల్ల లాభాలు భారీగా పెరిగాయి. కంపెనీ నికర ప్రీమియం ఆదాయం కూడా Q3FY22లో రూ.97,620 కోట్లతో పోలిస్తే Q3FY23లో రూ.1.1లక్షల కోట్లకు పెరిగింది. ఇది గతంలో కంటే దాదాపు 15 శాతం పెరుగుదల.


Click it and Unblock the Notifications