PSU Stock: దేశంలో డిఫెన్స్ స్టాక్స్ భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ ప్రవాహాలు సైతం డిఫెన్స్ రంగంలోని కంపెనీలకు వెళుతున్నాయి. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల షేర్లపై మార్కెట్లోని ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది.
ఈ రోజుల్లో రక్షణ రంగ కంపెనీల షేర్లపై మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఒకటైన LIC.. గత రెండు త్రైమాసికాలుగా రక్షణ రంగ స్టాక్‌లలో తన వాటాలను క్రమంగా పెంచుకుంటోంది. చర్య ఈ రంగంలో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా ఈ డిఫెన్స్ స్టాక్‌లో తమ వాటాను పెంచుకోవడం వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత పెరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షేర్ల గురించే.

శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి భారత్ డైనమిక్స్ స్టాక్ ధర బీఎస్ఈలో ఒక్కోటి రూ.1419.60 రేటు వద్ద ముగిశాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.51,791 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు గడచిన ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 135 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు 74.93 శాతం వాటాను కలిగి ఉండగా, పబ్లిక్ ఇన్వెస్టర్లు 12.49 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 3.06 శాతం, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 9.52 శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కంపెనీలో 1.83% వాటాతో 67,06,120 షేర్లను కలిగి ఉంది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గైడెడ్ మిసైల్స్, అనుబంధ రక్షణ పరికరాల తయారీలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద భారత ప్రభుత్వ సంస్థగా 1970లో హైదరాబాద్‌లో స్థాపించబడింది. కంపెనీ 2000లో భారత ప్రభుత్వంచే మినీ-రత్న విభాగంలో నామినేట్ చేయబడింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.854 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. FY24లో నిర్వహణ లాభం రూ.613 కోట్లుగా నమోదైదంది.


Click it and Unblock the Notifications