కూతురు అనగానే ఖర్చు అనుకుంటారు. చదువు/ ఉద్యోగంతోపాటు పెళ్లి కోసం పొదుపు చేస్తారు. కూతురు పేరుపై బ్యాంకులో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. ఇతరుల డబ్బులు కూతురి పేరుపై అప్పుగా కూడా ఇస్తుంటారు. పుట్టిన దగ్గరి నుంచే డబ్బులు కూడబెడుతుంటారు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీ పాలసీ అందిస్తోంది. ఎల్‌ఐసీ జీవన్ లక్ష్య పాలసీ పేరులో మంచి ఆఫర్ ప్రకటించారు. ఈ పాలసీని ఎల్‌ఐసీ కన్యాధాన్ అని పిలుస్తారు.
ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకుంటే.. దాదాపు రూ.27 లక్షలు పొందే వీలు ఉంటుంది. అయితే రోజుకు రూ.121 ఆదా చేస్తేనే పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. నెలకు రూ.3,500 అవుతుంది. ఏడాదికి 43 వేలకు పైగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పొదుపు చేసిన డబ్బును ప్రతి నెలా ఎల్‌ఐసీ ప్రీమియంగా చెల్లించాలి. పాలసీదారు చనిపోతే ప్రీమియం కట్టాల్సిన పని లేదు. ఆ కుటుంబానికి పాలసీ డబ్బులు లభిస్తాయి.

18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీ టర్మ్ మాత్రం 25 ఏళ్లు. కానీ 22 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల బీమా మొత్తానికి 18 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో రూ.27 లక్షలు లభిస్తాయి. బీమా మొత్తం రూ.10 లక్షలు, బోనస్ రూ.12.2 లక్షలు, ఎఫ్ఏబీ రూ.4.5 లక్షలు ఇందులో కలిపి ఇస్తారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications