Infosys News: దిగ్గజ కంపెనీలుగా రికార్డులకెక్కిన పలు సంస్థలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాయి. దీనికి ప్రముఖ కారణం కాలంతోపాటు అప్‌డేట్ కాకుండా కూర్చుని ఉండటమేనని ఇట్టే చెప్పేయెచ్చు. అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని భావించిందో లేదా ప్రైవేట్ కంపెనీలతో పోటీని తట్టుకోవాలంటే అప్‌గ్రేడ్ కావాలని చూస్తోందో కానీ LIC కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశపు అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC తన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఇన్ఫోసిస్‌తో జతకట్టింది. ఉద్యోగుల కోసం ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్‌ను అలాగే బ్యాక్-ఎండ్‌ను ఎనేబుల్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జీవిత బీమా పరిష్కారాలను అందించే టెక్నాలజీ ఎనేబుల్డ్ ఆర్గనైజేషన్‌గా LICని మార్చడమే తమ లక్ష్యమని సంస్థ CEO మరియు MD సిద్ధార్థ మొహంతి తెలిపారు.

'సాంకేతికత మా కస్టమర్లకు గొప్ప అంతర్దృష్టులను రూపొందించడంలో మాకు సహాయపడుతుంది. భారతీయ అధునాతన డిజిటల్ ఎకో-సిస్టమ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా వారికి మెరుగైన సేవలందించేందుకు మాకు అవకాశం లభిస్తుంది. డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్ (DIVE) కింద కస్టమర్‌లు, భాగస్వాములు మరియు ఉద్యోగుల అనుభవాన్ని మెరుగుపరచడానికి LIC తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై దృష్టి సారించింది' అని మొహంతి వెల్లడించారు.
'డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో ఇన్ఫోసిస్ విస్తృతమైన అనుభవాన్ని, AI మరియు క్లౌడ్‌లో నైపుణ్యాన్ని LICకి అందిస్తోంది. తద్వారా అత్యుత్తమ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను క్రియేట్ చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలతో LICని సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. దీనితో పాటు LIC కస్టమర్లు, ఏజెంట్లు మరియు ఉద్యోగులకు 'డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను' అందించాలని పనిచేస్తున్నాము' అని ఇన్ఫోసిస్ CEO & MD సలీల్ పరేఖ్ వివరించారు.


Click it and Unblock the Notifications