IDBI Bank Q4 Results: ఎల్ఐసీ, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ అనేక త్రైమాసికాలుగా తన పనితీరును మెరుగుపరుచుకుంటోంది. ఒకప్పుడు బ్యాంక్ పనితీరు సరిగా లేకపోవటంతో ఈ కంపెనీలోని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది.
బ్యాంక్ తాజాగా శనివారం నాడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి-మార్చి మధ్య కాలంలో నికర లాభం రూ.1,628 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,133 కోట్ల నికర లాభం కంటే ఇది 44 శాతం అధికం కావటం గమనార్హం. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.7,887 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం బ్యాంక్ ఇన్సూరెన్స్ దిగ్గజ ఎల్ఐసీ, భారత ప్రభుత్వ యాజమాన్యంలో ముందుకు సాగుతోంది.

అలాగే 2023-24 మెుత్తం ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ నికర లాభం ఏకంగా 55 శాతం వృద్ధితో ఆల్ టైమ్ హై అయిన రూ.5,634 కోట్లకు చేరుకున్నట్లు త్రైమాసిక ఫలితాల్లో ప్రకటించింది. దీనికి ముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర లాభం కేవలం రూ.3,645 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం భారీగా పెరిగి రూ.30,037 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో బ్యాంక్ మార్చి త్రైమాసిక కాలంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ. 3,688 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో బ్యాంక్ తన నికర నిరర్థక ఆస్తులను మార్చి 31 నాటికి 0.34 శాతానికి తగ్గించుకుంది. ఏడాది కిందట ఇది 0.92 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఐడీబీఐ బ్యాంక్ ఇన్వెస్టర్లకు 15 శాతం డివిడెండ్ అందించాలని నిర్ణయించింది. అయితే షేర్ల హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాత అర్హులైన ఇన్వెస్టర్లు డబ్బును పొందుతారని పేర్కొంది. ఇదే క్రమంలో బ్యాంక్ నికర అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 16 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.1.9 ట్రిలియన్లకు చేరుకున్నాయి. అలాగే డిపాజిట్లు 9 శాతం వృద్ధితో రూ.2.8 ట్రిలియన్లకు పెరిగాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తులపై రాబడి 39 బేసిస్ పాయింట్లు పెరిగి 1.82 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ షేర్ ధర ఎన్ఎస్ఈలో 1.65 శాతం క్షీణించి రూ.89.60 వద్ద ప్రయాణాన్ని ముగించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications