ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తన గ్రూప్ వ్యాపార కార్యకలాపాల కోసం సరికొత్త ఐటీ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. e-PGS పేరుతో రూపొందించిన ఈ సెంట్రలైజ్డ్ వెబ్ బేస్ట్ వర్క్ ఫ్లో ఆధారిత ప్లాట్‌ఫాంను దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో ఎల్ఐసీ ఇండియా చైర్మన్ ఎంఆర్‌కే కుమార్ ప్రారంభించారు. ఎల్ఐసీ ఎండీలు విపిన్ ఆనంద్, ముఖేష్ గుప్తా, రాజ్ కుమార్, ఎస్ మొహంతి, ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేష్ శర్మ్ పాల్గొన్నారు.
కేంద్రకృత వసూళ్లు, చెల్లింపుల కోసం ఈ నూతన ప్లాట్‌ఫాంను ఎల్ఐసీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ప్లాట్‌ఫాంతో ఎల్ఐసీ వసూళ్లు, చెల్లింపుల అకౌంటింగ్ పూర్తిగా కేంద్రీకృతమవుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త e-PGS కస్టమర్ పోర్టల్ ద్వారా సమగ్ర స్వీయ-సేవ సామర్థ్యాలను అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కార్పోరేట్ కస్టమర్లు తమ డేటాను ఇక్కడ చూసుకోవచ్చు. క్లెయిమ్స్‌ను లాడ్జ్ చేయగలరు, ట్రాక్ చేసుకోవచ్చు.

టెక్నాలజీ ఇంటెన్సివ్ కార్పోరేట్ కస్టమర్లకు అనుగుణంగా కొత్త ప్లాట్‌ఫాం రూపొందించబడిందని, గ్రూప్ బిజినెస్ ప్లాట్‌ఫాంలో కస్టమర్ సర్వీస్ ముఖచిత్రాన్ని మారుస్తుందని, ఈ కొత్త వ్యవస్థ డేటా, సేవల్లో అధికస్థాయిలో అనుసంధానం చేయగలదని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్ అన్నారు.


Click it and Unblock the Notifications