LIC సూపర్ స్కిం... ప్రతినెల మీకు పెన్షన్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..
రిటైర్మెంట్ తర్వాత జీతం ఆగిపోతుంది, కానీ ఖర్చులు అలాగే ఉంటాయి. ప్రస్తుతం అతిపెద్ద సమస్య ఎదుర్కొంటున్నది ప్రైవేట్ ఉద్యోగులు ఇంకా సొంతంగా చిన్న చిన్న పనులు చేసుకునే వారు. ఎందుకంటే వీళ్ళకి పెన్షన్ ఉండదు. మన దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన LIC ఇలాంటి వారి కోసం ఒక పెన్షన్ స్కిం అందిస్తుంది, ఇందులో ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు.

LIC పెన్షన్ పథకం: LIC న్యూ జీవన్ శాంతి పథకంలో ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. న్యూ జీవన్ శాంతి ప్లాన్లో మీరు ఒక్కసారి మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టాలి. తరువాత మీకు జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది, అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు ఆదాయం వస్తుంది.
కొత్త జీవన్ శాంతి పథకం ఏంటి : రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం పెన్షన్ పొందడానికి LIC కొత్త జీవన్ శాంతి స్కిం బెస్ట్. మీరు ఈ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాక రిటైర్మెంట్ తర్వాత అంటే 60 సంవత్సరాల వయస్సు తర్వాత, మీరు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది . మీరు సరైన సమయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడితే మీ జీవితాంతం సంవత్సరానికి లక్ష వరకు చొప్పున పెన్షన్ వస్తుంది.
మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే : మీరు ఈ ప్లాన్‌లో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే మీ పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు 55 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం, ఐదు సంవత్సరాల తర్వాత మీకు 60 ఏళ్లు నిండాక మీ జీవితం మొత్తానికి ప్రతి సంవత్సరం రూ. 1,02,850 పెన్షన్ గా వస్తుంది. మీకు కావాలంటే, మీరు ఈ మొత్తాన్ని ఒక నెలలో, మూడు నెలల్లో లేదా ఆరు నెలల్లో తీసుకోవచ్చు. ఈ పథకం ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే పాలసీదారుడు మరణిస్తే నామినీకి వడ్డీతో సహా మొత్తం డబ్బుఇస్తారు. ఈ పాలసీని ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే దీని సరెండర్ వాల్యూ ఇతర పాలసీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ పాలసీపై మీకు లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ స్కిం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం లేని వారికీ అలాగే ఆన్ ఆర్గనైజేడ్ సెక్టార్లో పని చేసే వారికీ చాల ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి హాయిగా జీవితం మొత్తం పెన్షన్ పొందడానికి సౌకర్యంగా ఉంటుంది


Click it and Unblock the Notifications