రిలయన్స్ కంటే అధిక మార్కెట్ వ్యాల్యూతో ఎల్ఐసీ, ప్రపంచంలోనే నెం.1
లిస్టింగ్ తర్వాత లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 210 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎల్ఐసీ లిస్టింగ్ అయితే దీని మార్కెట్ క్యాప్ 272 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే, ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ ఇన్సూరర్ కంపెనీగా ఉండనుంది. అలాగే, ప్రపంచ రెండో అతిపెద్ లిస్టెడ్ ఇన్సురెన్స్ ప్రొవైడర్‌గా నిలుస్తుంది. ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లుగా ఉంటుందని గతంలో అంచనా వేశారు. లిస్టింగ్ తర్వాత ఈ మార్కెట్ పెరిగే అవకాశాలున్నాయి.

ఎల్ఐసీ తర్వాతే
మన కరెన్సీలో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.16 లక్షల కోట్లుగా ఉంది. అదే ఎల్ఐసీ లిస్టింగ్ తర్వాత రూ.20 లక్షల కోట్లు దాటుతుంది. ఇంత అధిక మార్కెట్ వ్యాల్యూ కలిగిన కంపెనీ మరొకటి భారత్‌లో ఉండదు. రిలయన్స్ తర్వాత టీసీఎస్ రూ.14 లక్షల కోట్లకు పైగా, HDFC బ్యాంకు రూ.8.5 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ రూ.7.3 లక్షల కోట్ల వద్ద ఉంది. ప్రభుత్వం ఎల్ఐసీ వ్యాల్యుయేషన్‌ను 203 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తూ, ఐపీవోకు వెళ్లవచ్చునని గత నెలలో ఓ నివేదిక వచ్చింది.

మూడింట రెండొంతుల వాటా
ఎల్ఐసీ ఎంబెడేడ్ వ్యాల్యూకు 3.05 రెట్ల అధిక వ్యాల్యూకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ ఇదే తరహాలో ఉంది. HDFC లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ వ్యాల్యూ మాత్రం ఎంబెడెడ్ వ్యాల్యూకు 4.1 రెట్లు అధిక స్థాయిల ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ వ్యాల్యూ 2.6 రెట్లుగా ఉంది. వీటితో పోలిస్తే బిజినెస్ పరిమాణం, బ్రాండ్ వ్యాల్యూను బట్టి ఎల్ఐసీకి ఇంకా అధిక వ్యాల్యూ రావాల్సి ఉంది. దేశీయంగా బీమాలో ఎల్ఐసీ వాటా 65 శాతానికి పైగా ఉంది. పాలసీ బజార్‌తోను ఎల్ఐసీ ఒప్పందం కుదుర్చుకుంది.

సాధారణ ఇన్వెస్టర్లకు ప్రయోజనం
కేంద్రం ఎల్ఐసీని 203 బిలియన్ డాలర్ల వ్యాల్యూకు పబ్లిక్ ఇష్యూ చేయాలనే నిర్ణయం తీసుకుంటే సాధారణ ఇన్వెస్టర్లకు కొంత వ్యాల్యూని మిగిల్చినట్లేనని అంటున్నారు. ఇదే వ్యాల్యూ ప్రకారం 10 శాతం వాటాను విక్రయించినా కేంద్రానికి రూ.1.5 లక్షల కోట్లు లభిస్తాయి. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరుతుంది. కానీ తాజా బడ్జెట్ ప్రకారం ఈ లక్ష్యాన్ని రూ.78,000 కోట్లకు కుదించారు.


Click it and Unblock the Notifications