LICకి 1000 కోట్ల భారీ నష్టం.. ! కొంపముంచింది ఆ కంపెనీ షేర్లే..

ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు సోమవారం ఢమాలయ్యాయి. దింతో బ్యాంక్ షేర్లు 27.17% తగ్గి రూ.655.95 వద్ద ముగిశాయి, 5 సంవత్సరాలలో ఇదే అత్యల్ప స్థాయి. ఈ పతనం కారణంగా దేశంలోనే అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ LIC దాదాపు రూ.1,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. LIC ఇండియాలోనే అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారి కూడా. ఈ బ్యాంకులో LICకి 5.23% వాటా ఉంది. అలాగే బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని అవకతవకలను నివేదించింది. ఇవన్నీ బ్యాంకు ఆదాయాలపై ఒకేసారి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కారణంగా బ్యాంక్ షేర్లు పడిపోయాయి, దింతో నవంబర్ 2020 తర్వాత అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి.

RBI 1 ఏప్రిల్ 2024 నుండి కొత్త రూల్స్ అమలు చేసింది. ఈ నిబంధనలను అనుసరించి బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఇంటర్నల్ రివ్యూ నిర్వహించింది. ఈ రివ్యూలో బ్యాంక్ కొన్ని అవకతవకలను కనుగొంది. దింతో బ్యాంకు ఆస్తులు, అప్పులకు సంబంధించిన అకౌంట్స్'లో ఈ అవకతవకలు బయటపడ్డాయి. బ్యాంకు ఇంటర్నల్ రివ్యూ ప్రకారం ఈ అక్రమాల ప్రభావం మొత్తం ఆస్తులలో దాదాపు 2.35%కి సమానం. అంటే దాదాపు రూ.2,000-2,100 కోట్లకు అంచనా.

LIC loses 965 crore stockmarket volatality IndusInd Bank share price crashes 27Percent to nearly 5years low

ఎవరు నష్టపోయారు: ఇండస్ఇండ్ షేరు ధర రూ.654 కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు LIC షేర్ల విలువ రూ.2,434 కోట్లు. ముందు రోజు మార్కెట్ క్లోసింగ్ ధర ప్రకారం ఈ విలువ రూ.3,398 కోట్లు. LIC మాత్రమే కాకుండా కోటక్ మ్యూచువల్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, UTI MF అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా వంటి చాల ఇతర మ్యూచువల్ ఫండ్ కంపెనీలకి కూడా ఈ బ్యాంకులో వాటా ఉంది. ఈ నష్టం ప్రభావం 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసిక లాభాలపై కనిపిస్తుంది. దీని వల్ల బ్యాంకు లాభాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాక Q4FY25లో బ్యాంక్ నష్టాన్ని కూడా చవిచూడవచ్చు. గత ఏడాది కాలంగా నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాక్ అత్యంత ఘోరమైన పనితీరు కనబరిచిన స్టాక్‌లలో ఒకటి. ఈ కాలంలోనే షేర్ ధర 55% కంటే పైగా తగ్గింది.

బ్యాంకు సమస్యలు: ఇండస్ఇండ్ బ్యాంకు అనేక ఇతర సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. అలాగే, బ్యాంకు ఎండీకి ఒక సంవత్సరం మాత్రమే పదవీకాలం ఇచ్చారు, అయితే బోర్డు మూడు సంవత్సరాల పదవీకాలాన్ని ప్రతిపాదించింది. అనేక బ్రోకరేజ్ సంస్థలు ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లను తగ్గించి, వాటి టార్గెట్ ధరను తగ్గించాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇండస్ఇండ్ బ్యాంక్‌ను కవర్ చేసే 38 మంది విశ్లేషకులలో నలుగురు దానికి అమ్మకపు రేటింగ్ ఇచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+