త్వరలో ఐపీవోకు రానున్న ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా-LIC) జీ-సెక్‌లలోను 19 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీస్ సింగిల్ లార్జెస్ట్ యజమాని, లార్జెస్ట్ ఫండ్ మేనేజర్ అలాగే హౌస్ సేవింగ్స్ హోల్డర్ అయిన ఎల్ఐసీ వ్యాల్యూ పరంగా ఎస్బీఐ డిపాజిట్స్‌ను కూడా చిన్నదిగా చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2061 నాటికి మెచ్యూర్ అయ్యే రూ.80.7 లక్షల కోట్లకు పైగా ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలలో 17 శాతం వాటాను కలిగి ఉంది. గవర్నమెంట్ డెట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల నేతృత్వంలోని వాణిజ్య బ్యాంకులు సమష్టిగా 40 శాతం కలిగి ఉన్నాయి. ఇతర బీమా సంస్థలు 5 శాతం కలిగి ఉన్నాయి.

అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు
స్విస్ బ్రోకరేజ్ యూబీఎస్ సెక్యూరిటీస్ ప్రకారం జీ-సెక్‌ల ఎల్ఐసీ యాజమాన్యం మార్చి 2019లో గరిష్టస్థాయికి చేరుకుంది. దాదాపు 3 ట్రిలియన్ డాలర్లతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో ఎల్ఐసీ అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా ఉంటోంది. AUMలో 29 శాతం వాటా లేదా 130 బిలియన్ డాలర్లతో ఎల్ఐసీ దేశీయ సంస్థాగత ఈక్విటీ AUMలో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఎల్ఐసీ ఈక్విటీలలో దాదాపు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది.

9 శాతం వాటా
దాదాపు 9 శాతం వాటాతో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టాక్స్‌లో ఎల్ఐసీకి అసమానమైన అధిక వాటా ఉంది. డిసెంబర్ నాటికి రిలయన్స్‌లో పది శాతం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ కంపెనీల్లో 5 శాతం చొప్పున, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ కంపెనీల్లో 4 శాతం చొప్పున ఉంది. లిస్టింగ్ అనంతరం లిస్టెడ్ ఈక్విటీలలో ప్రభుత్వ పోర్ట్‌పోలియోలో ఎల్ఐసీయే అతిపెద్దది అవుతుంది.

ప్రతి రూ.100లో ఎల్ఐసీకి రూ.10
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ బడ్జెట్ ఫైనాన్సింగ్ కోణం నుండి ఎల్ఐసీ కీలకమైనది. అలాగే, రిలయన్స్ 214 బిలియన్ డాలర్లు, టీసీఎస్ 182 బిలియన్ డాలర్ల తర్వాత రిలయన్స్ 172 బిలియన్ డాలర్లతో మూడో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తుంది. 28 కోట్ల పాలసీదారులతో గృహ పొదుపులో ఎల్ఐసీ గరిష్ట వాటాను కలిగి ఉంది. ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం కుటుంబాలు ఆదా చేసే ప్రతి రూ.100లో ఎల్ఐసీకి రూ.10 వెళ్తుంది. బ్యాంకు డిపాజిట్స్‌లో ఎనిమిది శాతం ఎస్బీఐకి వెళ్తుంది. ఈ వాటా కంటే ఎక్కువ.


Click it and Unblock the Notifications