LIC IPO: యాంకర్ ఇన్వెస్టర్ల అనూహ్య స్పందన, రూ.5627 కోట్లు సమీకరణ
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల భాగానికి అనూహ్య స్పందన లభించింది. ఈ విభాగానికి కేటాయించిన రూ.5630 కోట్ల వ్యాల్యూ కలిగిన షేర్లకు మంచి డిమాండ్ లభించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు 59.3 మిలియన్ల షేర్లు అలాట్ చేశారు. ఒక్కో షేర్‌కు రూ.949గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఎల్ఐసీ రూ.5627 కోట్లను సమీకరించినట్లు సోమవారం వెల్లడించింది. మే 4వ తేదీన ఎల్ఐసీ మెగా ఐపీవో ప్రారంభమవుతుంది. ఈ ఐపీవో మే 9న ముగియనుంది.
సొసైటీ జెనరల్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ ఆఫ్ నార్వే, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, BNP ఇన్వెస్ట్‌మెంట్స్ తదితర ఫారెన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 శాతం అలాట్మెంట్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఉంది. 15 డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్‌కు 42.17 మిలియన్ల షేర్లు కేటాయించారు. ఇందులో ఎస్బీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, HDFC, ఆదిత్య బిర్లా, యాక్సిస్, నిప్పోన్, యూటీఐ ఉన్నాయి. HCL కార్పోరేషన్, ఎన్పీఎస్ ట్రస్ట్, పీఎన్‌బీ మెట్ లైఫ్, బజాజ్ అలయెన్స్, జనరల్ ఇన్సురెన్స్ వంటి యాంకర్ ఇన్వెస్టర్లు కూడా ఉన్నాయి.

యాంకర్ ఇన్వెస్టర్లకు 59,296,853 షేర్లు కేటాయించగా, 42,173,610 (71 శాతం) షేర్లు 15 డొమెస్టిక్ మ్యూచువల్ పండ్స్‌కు 99 స్కీమ్‌ల ద్వారా కేటాయించారు. నాలుగు రకాల స్కీమ్స్ ద్వారా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రూ.1000 కోట్లు, పది రకాల స్కీమ్స్ ద్వారా HDFC MF రూ.650 కోట్లు, ఐసీఐసీఐ MF రూ.700 కోట్ల విలువ కలిగిన షేర్లకు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications