లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నేడు (మే 04, 2022) ఐపీవోకు వస్తోంది. ధరల శ్రేణి రూ.902 నుండి రూ.949 మధ్య ఉంది. ప్రభుత్వం ఎల్ఐసీ వాటాలో 3.5 శాతం లేదా 22.13 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. ఈ ఐపీవో ద్వారా రూ.21,000 కోట్లను సమీకరిస్తోంది. ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60, రిటైల్, ఉద్యోగులకు రూ.40 డిస్కౌంట్ వర్తిస్తుంది.
- మధ్యాహ్నం గం.12 సమయం వరకు ఎల్ఐసీ ఐపీవో 27 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. ఎల్ఐసీ పాలసీదారుల విభాగంలో 95 శాతం, ఉద్యోగుల పోర్షన్లో 46 శాతం, రిటైల్ ఇన్వెస్టర్స్ విభాగంలో 30 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 5 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యారు.
- ఎల్ఐసీ ఐపీవో ఓపెన్ అయ్యాక ఎల్ఐసీ ఇష్యూ ధరలో 0.12 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. ఉదయం గం.11 సమయానికి రిటైల్ సెగ్మెంట్లో 0.18 శాతం సబ్‌స్క్రైబ్ అయింది.
- భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవో ఎల్ఐసీదే. ఓపెనింగ్ హవర్స్‌లో 3 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఉద్యోగుల విభాగంలో 7 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ విభాగంలో 5 శాతం, పాలసీదారుల విభాగంలో 3 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

- జారీ చేస్తోన్న మొత్తం 22.13 కోట్ల షేర్లలో 9.88 కోట్ల షేర్లు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 2.6 కోట్ల షేర్లు నాన్-ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 15,81,249 షేర్లు ఉద్యోగులకు, 2,21,37,492 షేర్లు పాలసీదారులకు కేటాయించింది.
- రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, పాలసీదారులు బుధవారం నుండి ఎల్ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎల్ఐసీ పాలసీదారులకు 10 శాతం షేర్లు కేటాయించారు. ఎల్ఐసీ ఉద్యోగులకు 0.7 శాతం షేర్లు కేటాయించారు. హౌస్ హోల్డ్ ఇన్వెస్టర్లకు 31.25 శాతం షేర్లు కేటాయించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications