లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు మంగళవారం (మే 17) స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడ్ అయ్యాయి. ఎల్ఐసీ 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867.20 వద్ద లిస్ట్ అయింది.
కేంద్రం ఎల్ఐసీలో 22.13 కోట్ల షేర్లను లేదా 3.5 శాతం ఐపీవో ద్వారా విక్రయించి రూ.20,557 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్లకు కేటాయించే షేర్లకు ఒక్కోదానికి ధరను రూ.949గా నిర్ణయించింది. ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్‌తో రూ.889 ధరపై షేర్లను కేటాయించగా, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్‌తో రూ.904 ధరతో షేర్లను అలాట్ చేశారు. మూడు రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఎల్ఐసీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై, 9వ తేదీన ముగిసింది.

రిటైల్, పాలసీదారుల సబ్‌స్క్రిప్షన్ అధికంగా అయింది. 210 షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే పాలసీదారులకు 48 షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు 77 షేర్లు అలాట్ అయ్యాయి. పాలసీదారులు, రిటైలర్లు ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొంత వెనక్కి వచ్చింది. దీంతో వారు లిస్టింగ్ తర్వాత మరిన్ని షేర్లను కొనే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంటుంది.
ఈ షేర్ ధరను రూ.949గా నిర్ణయించారు. పాలసీదారులకు రూ.60, రిటైలర్లకు, ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ ఇచ్చారు. మార్కెట్ వాటాలో ఎల్ఐసీదే 60 శాతానికి పైగా ఉంది. కానీ గత కొంతకాలంగా ఎల్ఐసీ మార్కెట్ పడిపోతోంది. ప్రయివేటు సంస్థల నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఆదరణ ఎలా ఉంటుందనేది చూడాలి.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications