కోట్లాదిమంది ఎదురు చూస్తున్నారు ఎల్ఐసీ ఐపీవో కోసం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవో రావాల్సి ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రాక ఆలస్యమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది రానుంది. ఎల్ఐసీ ఐపీవోకు అనుగుణంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా తమ ముఖ్య ఆర్థిక అధికారి(CFO)గా రిలయన్స్-నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన సునీల్ అగర్వాల్‌ను నియమించింది.
బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు చెబుతున్నారు. CFOను బయటి నుండి నియమించుకోవడం ఎల్ఐసీకి ఇది మొదటిసారి. ఈయనకు ముందు ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శుభాంగి సంజయ్ సోమన్ సీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. సునీల్ అగర్వాల్ ఎల్ఐసీలోకి రావడానికి ముందు రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్‌లో పుష్కరకాలం పని చేశారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్‌లో కూడా అయిదేళ్లు పని చేశారు.

ఎల్ఐసీ గత సెప్టెంబర్ నెలలో సీఎఫ్ఓ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుందని, వార్షిక వేతనం రూ.75 లక్షలు అందిస్తామని పేర్కొంది. ఈ నియామకం మూడేళ్ల పాటు ఉంటుంది లేదా అభ్యర్థికి 63 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉంటుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications