లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మెగా ఐపీవోకు అద్భుత స్పందన కనిపిస్తోంది. మధ్యాహ్నం గం.1 సమయానికి రిటైల్ విభాగానికి కేటాయించిన షేర్లు 34 శాతానికి దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఐసీ పాలసీదారు విభాగానికి కేటాయించిన షేర్లలో అన్నీ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి 31 శాతం షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లు కేటాయించగా, 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఉద్యోగులకు 15.81 లక్షల షేర్లను అలాట్ చేశారు. 53 శాతం షేర్లకు బిడ్స్ దాఖలు అయ్యాయి. నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో 29.64 కోట్ల షేర్లకు 0.6 శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 3.9 కోట్ల షేర్లు కేటాయించగా, 6060 షేర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902 నుండి రూ.949గా కేటాయించారు. అంటే గరిష్ట ధర వద్ద ఇన్వెస్టర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్స్ డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదలీ అవుతాయి. మే 17న ఎక్స్చేంజీల్లో షేర్లు నమోదు అవుతాయి.

ఎల్ఐసీ గ్రే మార్కెట్ ప్రీమియం గతవారం 5 శాతంగా అంచనా వేయగా, బుధవారం గ్రే మార్కెట్‌లో షేర్ దూకుడు రూ.85 ప్రీమియంతో ట్రేడ్ అవుతోందని తెలుస్తోంది. గత గురువారం ప్రీమియం రూ.45గా ఉంది. ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లు తుది ఆఫర్ పైన రూ.45 తగ్గింపుతో షేర్లను పొందుతారు. పాలసీదారులకు రూ.60 తగ్గింపు వర్తిస్తుంది. గ్రే మార్కెట్ అనేది అనధికారిక ప్లాట్ ఫామ్. ఇది సాధారణంగా కంపెనీ అంచనా జాబితా ధరను ట్రాక్ చేస్తుంది.
ఇదిలా ఉండగా, ఎల్ఐసీ ఐపీవో 47 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పాలసీదారుల విషయానికి వస్తే 1.61 రెట్లు, ఉద్యోగులు 83 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లు 49 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యారు.


Click it and Unblock the Notifications