LIC IPO: ఐపీవోకు 1.68 రెట్ల స్పందన, రూ.24 వేల కోట్లకు పైగా బిడ్స్
బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో నేడు (ఆదివారం) 5వ రోజు. ఐపీవో దరఖాస్తు కోసం మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. 4వ తేదీన ప్రారంభమైన ఐపీవో సబ్‌స్క్రిప్షన్ 9వ తేదీన ముగియనున్న విషయం తెలిసిందే. దరఖాస్తు కోసం శని, ఆదివారాలు కూడా ఓపెన్ ఉంది. నాలుగో రోజు వరకు రూ.24,365 కోట్ల విలువైన సబ్‌స్క్రిప్షన్ బిడ్స్ దాఖలయ్యాయి. శుక్రవారం నాటికి రూ.20,269 కోట్లు దాఖలయ్యాయి. శనివారం పెరిగింది.
పాలసీదారుల కోటాలో 4.67 రెట్లు వచ్చింది. మొత్తానికి ఐపీవోకు ఇప్పటి వరకు 1.68 రెట్ల స్పందన లభించింది. 16,20,78,067 బిడ్స్ దాఖలు చేయగా, 26,83,18,335 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం నుండి పూర్తి స్పందన లభించింది. వీరికి 2,96,48,427 షేర్లను కేటాయించగా, 3,21,59,055 షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి.

అంటే 1.08 రెట్ల స్పందన లభించింది. అర్హులైన సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో మాత్రం 67 శాతం స్పందన మాత్రమే లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 6.9 కోట్ల షేర్లు కేటాయించగా, 10.06 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే 1.46 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యారు. పాలసీదారుల విభాగంలో మాత్రం 4.67 శాతం, ఉద్యోగుల విభాగంలో 3.54 శాతం రెట్ల స్పందన వచ్చింది.
పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 22.13 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. ధరను రూ.902 నుండి రూ.949 మధ్య కేటాయించారు.


Click it and Unblock the Notifications