LIC IPO: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సరే.. రెండేళ్ల వరకు వాటా తగ్గదు
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన తర్వాత కనీసం రెడేళ్ల పాటు సంస్థలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోవడానికి అవకాశం లేదు. ఈ మెగా ఐపీవోలో పాల్గొనే ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం తన వైఖరిని ఐపీవోపై రోడ్-షో సమయంలోనే ఇన్వెస్టర్లకు తెలిపింది. ఎల్ఐసీ చట్టంలో సవరణలు చేసిన తర్వాత ప్రభుత్వం తన వాటాను 75 శాతం వరకు తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఐపీవో ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం తన వాటాను తగ్గించుకునే అవకాశముందని వార్తలు వచ్చాయి.
దీంతో ఐపీవో ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం తన వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది. ఇది ఇన్వెస్టర్లకు ఊరటనిస్తుంది. రెండేళ్ల పాటు తన వాటాను విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని చెబుతున్నారు. అలా చేస్తే కంపెనీ షేర్లపై ఒత్తిడి పెరిగి ఇన్వెస్టర్లు నష్టపోతారని, అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని అంటున్నారు.

పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ పరిమాణం రూ.1 లక్ష కోట్లు దాటితే అయిదేళ్ల లోపు ఆ సంస్థలో పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటాను కనీసం 25 శాతానికి పెంచవలసి ఉంటుంది. కానీ ఎల్ఐసీ విషయంలో ప్రభుత్వం వచ్చే అయిదేళ్ల పాటు ఎలాంటి వాటా కుదింపుకు సుముఖంగా లేదు. దీంతో ప్రభుత్వం విషయంలో నియంత్రణ సంస్థల నుండి మినహాయింపు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే అయిదేళ్ల కాలంలో పబ్లిక్ ఇష్యూ ద్వారా లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వాటాను తగ్గించుకునే ఉద్దేశ్యం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications