ఎల్ఐసీ (లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) ఐపీవోకు రంగం సిద్ధమైంది. ఎల్ఐసీ తమ ఐపీవోకు అనుమతించాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబికి ఆదివారం దరఖాస్తు చేసింది. 31.6 కోట్ల షేర్లను అంటే ఐదు శాతం వాటాలను ఐపీవో ద్వారా విక్రయిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం 31.6 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.71వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు సెబి ఎదుట ప్రభుత్వం ఆదివారం డ్రాఫ్ట్ పేపర్స్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 5 శాతం వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

వంద శాతం ఓఎఫ్ఎస్ ద్వారా ఎల్ఐసీ ఐపీవోకు వెళ్తున్నట్లు తుహిన్ కాంత పాండే తెలిపారు. ఎల్ఐసీ ఎంబేడెడ్ వ్యాల్యూ రూ.5.39 లక్షల కోట్లు. ఐపీవోలో పాలసీదారులకు పది శాతం వాటాలను ఎల్ఐసీ విక్రయిస్తుంది. ఉద్యోగులకు కొంత రిజర్వేషన్ కల్పిస్తుంది.
ఎల్ఐసీ ఆఫర్ సైజ్ రూ.27వేల కోట్లుగా ఉంటుందని, మూడు రెట్ల వ్యాల్యూ కలిగిన షేర్లు విక్రయిస్తారని తెలుస్తోంది. ఎల్ఐసీ వాటా విజయవంతమైతే కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్‌లో రూ.78 వేల కోట్లు వస్తాయని అంచనా. ఇంతకుముందు ఎల్ఐసీ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని తుహిన్ కాంత పాండే తెలిపారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications